దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?

4 Apr, 2021 14:43 IST|Sakshi

ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

సాక్షి, తిరుపతి: మతాన్ని అడ్డుపెట్టుకుని విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని విమర్శించిన వ్యక్తే ఇప్పుడు మద్దతు తెలపడం శోచనీయమన్నారు. మత ప్రేరేపణలతో అధికారపక్షాన్ని ఓడించాలనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నీచ సంస్కృతికి పాల్పడుతున్నాయని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు.

ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనేది అందరికీ తెలుసని భూమన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడకుండా దేవుడ్ని అస్త్రంగా చేసుకుంటున్నారని, భగవంతుడిపై విశ్వాసం ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని తెలిపారు. దేవుడ్ని రాజకీయ వనరుగా మార్చుకున్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, మత విద్వేషాలు లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని గుర్తుచేశారు. తిరుపతిలో మత ప్రశాంతతకు భంగం కలిగించొద్దని, ప్రతిపక్షాల నీచ పనులకు భగవంతుడే శిక్ష వేస్తాడని భూమన తెలిపారు.


చదవండి:
హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్
ఎన్నికల బహిష్కరణకు కట్టుబడి ఉండాలి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు