తండ్రి జైల్లో ఉంటే.. లోకేష్ ఢిల్లీకి ఎందుకు పారిపోయారు?: ఎంపీ సురేష్‌ | Sakshi
Sakshi News home page

తండ్రి జైల్లో ఉంటే.. లోకేష్ ఢిల్లీకి ఎందుకు పారిపోయారు?: ఎంపీ సురేష్‌

Published Fri, Oct 6 2023 4:55 PM

Ysrcp Mp Nandigam Suresh Fires On Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: జగన్‌కు భయం అంటే ఏంటో చూపిస్తానన్న లోకేష్ ఢిల్లీ పారిపోయారని, రఘురామకృష్ణం రాజు గెస్ట్ హౌస్‌లో రెస్టు తీసుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తండ్రి జైల్లో ఉంటే ఎవరైనా ఢిల్లీ వెళ్లి ఇలా చేస్తారా?. స్కాంలో దొరికిపోయి జైల్లో కూర్చున్నారు. పవన్ నమ్ముకుని టీడీపీ నడుస్తోంది. రేపు లైట్లు ఆర్పి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఇలా పిలుపు ఇవ్వటానికి సిగ్గు ఉండాలి’’ అని ఎంపీ సురేష్‌ మండిపడ్డారు.

‘‘రాజధానిలో రైతుల జీవితాల్లో వెలుతురు లేకుండా చేశారు. ఆ పాపం ఊరికే పోతుందా?. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ తప్ప ఎవరూ ఫీలవటం లేదు. టీడీపీ, జనసేన జెండాలు చూసి ఇతర పార్టీలు భయపడటం అనేది వారి భ్రమ. ఈ రాష్ట్రంలో జగన్ అవసరం ఇంకో పాతికేళ్లు ఉందని జనం అనుకుంటున్నారు. చంద్రబాబు అవసరం లేదని జనానికి క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముసలి రక్తం ఎక్కించుకున్నారు. పవన్ కి భయం అంటే ఏంటో వచ్చే ఎన్నికల్లో గెలుపు రూపంలో మళ్లీ మేము చూపిస్తాం’’ అని ఎంపీ సురేష్‌ పేర్కొన్నారు.

‘‘జగన్ భయపడే మనిషి కాదు కాబట్టే సింగిల్‌గా వస్తానంటున్నారు. ప్రజలకి ఏం చేస్తారో చెప్పకుండా పవన్ జనాన్ని రెచ్చగొట్టటం ఏంటి?. లోకేష్ తండ్రి సంపాదనతో కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారని కోర్టులు కూడా నమ్మాయి. అందుకే జైల్లో ఉన్నారు. సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో ఎంత రచ్చ చేసినా చంద్రబాబును నమ్మేవారు లేరు. పాపాలు చేసిన వారికి ప్రజల సానుభూతి ఎప్పుడూ ఉండదు. రెండు ఎకరాల నుండి ఆరు లక్షల కోట్లు సంపాదించటం అంటే మామూలు విషయమా?. ఇలాంటి అవినీతి పరులను ప్రజలు క్షమించాలా?. చెదలు పట్టిన చంద్రబాబును వీరుడు, శూరుడు అనటం సిగ్గుచేటు’’ అంటూ సురేష్‌ దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబును నమ్మి బాగు పడినవారు లేరు. వైఎస్సార్ ఫ్యామిలీని నమ్మి నష్టపోయిన వారు లేరు. తప్పుడు పనులు చేసి జైలుకు పోయిన వ్యక్తికి సపోర్ట్ ఎవరూ ఇవ్వరు. కంచాలు వాయించండి, మంచాలు వాయించండి అంటే ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు చీకటిలో సోనియా, చిదంబరం కాళ్లు పట్టుకున్నారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టించారు. జగన్ మీద మచ్చ వేయాలంటే అది ఎప్పటికీ కుదరదని టీడీపీ గుర్తించాలి’’ అని ఎంపీ సురేష్‌ పేర్కొన్నారు.
చదవండి: టీడీపీకి.. స్కిల్‌ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్‌

Advertisement
Advertisement