వైభవంగా పవిత్రోత్సవం | Sakshi
Sakshi News home page

వైభవంగా పవిత్రోత్సవం

Published Fri, Sep 29 2023 1:52 AM

నిమజ్జనానికి తరలిస్తున్న వినాయక విగ్రహం - Sakshi

సింగరాయకొండ: పాతసింగరాయకొండ శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి రెండో రోజు అగ్నిప్రతిష్టాపన, పవిత్ర ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వాములవారి ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవమూర్తులకు పూజలు చేసి హోమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకటలక్ష్మీ నృసింహాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

రూ.1.50 లక్షలు పలికిన వినాయక లడ్డు

ముండ్లమూరు: మండలంలోని పసుపుగల్లు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 15 కేజీల లడ్డుకు గురువారం వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో గ్రామానికి చెందిన పిక్కిలి ఆదిలక్ష్మి అత్యధికంగా రూ.1.50 లక్షలకు లడ్డు దక్కించుకున్నారు. వినాయక విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు. విగ్రహ ఊరేగింపులో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతా శ్రీనివాసరెడ్డి, బిజ్జం కృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

వినియోగదారుల రక్షణ కమిటీ సభ్యుడిగా మల్లిక్‌

మార్కాపురం: జిల్లా వినియోగదారుల రక్షణ కమిటీ సభ్యునిగా ఓ.ఎ.మల్లిక్‌ను నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ ఏ.ఎస్‌.దినేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు కమిటీ నియామకం చేపట్టారని మల్లిక్‌ తెలిపారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.

పవిత్రప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్న
వేదపండితులు
1/1

పవిత్రప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్న వేదపండితులు

Advertisement
Advertisement