రెండు ఇళ్లలో చోరీ●

6 Nov, 2023 00:28 IST|Sakshi
చోరీ జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌
● రూ.1.73 లక్షల నగదు అపహరణ ● త్రిపురాంతకంలో ఘటన

త్రిపురాంతకం: పట్టపగలు రెండు ఇళ్లలో దొంగతనం జరిగి రూ.1.73 లక్షల నగదుతో పాటు బంగారు నగలు చోరీకి గురైంది. త్రిపురాంతకంలోని బ్రహ్మంగారికాలనీలో రెండు పక్క పక్క ఇళ్లలో ఈ చోరీ జరిగింది. దగ్గుపాటి నారాయణ ఇంట్లో రూ.1.25 లక్షల నగదు, మూడు తులాల బంగారు నక్లీసు, అద్దంకి రామాంజనేయులు ఇంట్లో రూ.48 వేల నగదు, బంగారు కమ్మలు రెండు జతలు, ఒక జత మాటీలు, చిన్న ఉంగరాలు నాలుగు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. వీరిద్దకూ హోటల్స్‌ నిర్వహిస్తూ జీవిస్తుంటారు. వర్షం వస్తుందని ఇంటికి వెళ్లేసరికి ఇళ్ల తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌ టీమ్‌ చేరుకుని వివరాలు సేకరించింది. స్థానిక ఎస్సై సుమన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు