14న ఐటీఐ కళాశాలలో జాబ్‌ మేళా | Sakshi
Sakshi News home page

14న ఐటీఐ కళాశాలలో జాబ్‌ మేళా

Published Sat, Nov 11 2023 1:28 AM

-

ఒంగోలు టౌన్‌: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో ఈ నెల 14న ఒంగోలులోని ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్‌.లోకనాథం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరవిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్‌, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, పయనీర్‌ మహేంద్ర, ఆస్ట్రో టెక్‌ స్టిల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, తోషిబా, గ్రీన్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ సంస్థల్లోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి గాను అప్రెంటిస్‌ షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఆపై చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఆధార్‌ కార్డు, విద్యార్హతలతో కూడిన జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఇస్తారన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12 నుంచి రూ.18 వేల వేతనం ఇస్తారన్నారు. పూర్తి వివరాలకు 7989244381కు ఫోన్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement