జగన్‌ మళ్లీ రావాలనేది ప్రజల ఆకాంక్ష | Sakshi
Sakshi News home page

జగన్‌ మళ్లీ రావాలనేది ప్రజల ఆకాంక్ష

Published Sat, Nov 11 2023 2:02 AM

- - Sakshi

చీమకుర్తి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో పేదల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని, అందుకే ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కావాలని కోరుకుంటున్నారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. శుక్రవారం చీమకుర్తిలోని గాంధీనగర్‌, కూనంనేనివారిపాలెం సచివాలయాల పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గత నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. గాంధీనగర్‌ సచివాలయం పరిధిలో 5,853 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.23 కోట్లు జమయ్యాయని వెల్లడించారు. అనంతరం గాంధీనగర్‌లో 1450 మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను అందించారు. వైఎస్సార్‌ సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ బాపతు వెంకటరెడ్డి, వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, వైస్‌ చైర్మన్‌ నలమల మాణిక్యం, కౌన్సిలర్లు కంజుల ప్రతాప్‌రెడ్డి, పత్తి కోటేశ్వరరావు, సోమా శేషాద్రి, జేసీఎస్‌ కన్వీనర్లు మంచా హరికృష్ణ, కమిషనర్‌ షేక్‌ ఫజులుల్లా పాల్గొన్నారు. కేవీ పాలెంలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, రూరల్‌ కన్వీనర్‌ పమిడి వెంకటేశ్వర్లు, జేసీఎస్‌ కన్వీనర్‌ చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలతో పేదల ముఖంలో చిరునవ్వు

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ

Advertisement
Advertisement