బోల్తా పడిన ఇసుక టిప్పర్‌

12 Nov, 2023 02:16 IST|Sakshi
కొండపి మండలం అనకర్లపూడి రోడ్డులోతిరగబడిన టిప్పర్‌

కొండపి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ రోడ్డు మార్జిన్‌లో పడిపోయింది. ఈ సంఘటన శనివారం కొండపి మండల పరిధిలోని అనకర్లపూడి రోడ్డులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం కామేపల్లి యార్డు నుంచి ఇసుక లోడ్‌తో చీమకుర్తి వెళ్తున్న ఇసుక టిప్పర్‌ అనకర్లపూడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు మార్జిన్‌ లోని అప్రోచ్‌ రోడ్డు పైకి టిప్పర్‌ టైర్లు వెళ్లాయి. ఈ క్రమంలో అప్రోచ్‌ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో టిప్పర్‌ అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కొండారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు రిజిస్టరు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై. నాగరాజు వివరించారు.

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌కు ఈదుమూడి విద్యార్థులు

నాగులుప్పలపాడు: 31వ రాష్ట్ర స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చెందిన ప్రాజెక్టు ఎంపికై నట్లు గైడ్‌ కె.స్వర్ణలత తెలిపారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌లో ఈదుమూడి పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు నందిని, అఖిల ప్రదర్శించిన సొగసు చూడ తరమా అనే ప్రాజెక్టు ప్రథమ స్థాఽనం సాధించి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు వివరించారు. స్టెన్సిల్స్‌ ఉపయోగించి నిరుద్యోగులైన మహిళలు సహజ సిద్ధమైన రంగులతో చీరలు, కర్టన్లకు డిజైన్‌ చేయడం వంటి అంశంపై ఈ ప్రాజెక్టు తయారు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై న ప్రాజెక్టును తయారు చేసిన విద్యార్థులకు డీఈవో సుబ్బారావు ప్రశంసపత్రాలు అందించి వారి గైడ్‌ స్వర్ణలతను కూడా అభినందించారు.

మరిన్ని వార్తలు