గేటు తీయగానే ఇంట్లో యజమాని | Sakshi
Sakshi News home page

గేటు తీయగానే ఇంట్లో యజమాని

Published Wed, Nov 15 2023 12:30 AM

-

గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు..ఆకు కూరలు..పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్‌. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు.

Advertisement
Advertisement