17న వై.పాలెంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు | Sakshi
Sakshi News home page

17న వై.పాలెంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు

Published Thu, Nov 16 2023 12:34 AM

-

ఒంగోలు: దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయార్థం అవసరమైన ఉపకరణాలను ఈనెల 17న యర్రగొండపాలెంలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిమ్‌కో సారథ్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంప్‌లో వీల్‌ చైర్లు, ట్రైసైకిల్స్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రైసైకిల్స్‌, చంక కర్రలు, అంధుల చేతి కర్రలు, శ్రవణ యంత్రాలు తదితర ఉపకరణాలను ఉచితంగా మంజూరుకు అర్హులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అవసరమైన దివ్యాంగులు, వృద్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9 గంటలకు వై.పాలెంలోని అంబేడ్కర్‌ భవనానికి ఆధార్‌కార్డు, సదరం సర్టిఫికెట్‌, యూడీఐడీ కార్డు, ఆదాయం సర్టిఫికెట్‌, ఫొటోలు తీసుకురావాలన్నారు.

వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

పొదిలి: పృధులాపురి గ్రామంలో వేంచేసిన పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం హనుమంత వాహన సేవ జరిగింది. ఉభయదాతలు వరికుంట్ల అనిల్‌కుమార్‌, లక్ష్మీ సురేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు దంపతులను మేళతాళాలతో ఆహ్వానించారు. హోమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మురళిచార్యులు, గౌరవాధ్యక్షుడు శ్రావణి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు యక్కలి శేషగిరిరావు, కార్యదర్శి పెరుమాళ్ల భాస్కరరావు, కోశాధికారి శనగపల్లి నాగేశ్వరరావు, వెలిశెట్టి నారాయణ, సామి రాజా తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement