840 | Sakshi
Sakshi News home page

840

Published Tue, Dec 19 2023 1:46 AM

త్రీఫేజ్‌ విద్యుత్‌ ఫీడర్‌ను ప్రారంభిస్తున్న సీఎండీ పద్మజనార్దనరెడ్డి   - Sakshi

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు

బేస్తవారిపేట: జిల్లాలో రూ.840 కోట్లతో ఆర్‌డీఎస్‌ఎస్‌(రీవ్యాంప్‌డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌) పనులు నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.పద్మ జనార్దనరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మోక్షగుండం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీలైనన్ని గ్రామాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు విద్యుత్‌ నష్టాన్ని తగ్గించడం, 25 ఏళ్లు దాటిన విద్యుత్‌ లైన్లను మార్చడం దృష్టి సారించామన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో భాగంగా సర్వే పూర్తి చేసి పనులు ప్రారంభించామన్నారు. ఈ పథకంలో రైతులకు ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటు చేసి 9 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించడం వల్ల 24 గంటలూ విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని, లోఒల్టేజీ సమస్య తీరడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతుందన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌–2లో ట్రాన్స్‌ఫార్మర్లు మార్చేందుకు ఎస్టిమేషన్‌లు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే నూతన ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ, ఈఈ కన్‌స్ట్రక్షన్‌ కె.వెంకటేశ్వర్లు, ఈఈ ఆపరేషన్స్‌ పి.నాగేశ్వరరావు, ఏడీఏలు, ఏఈలు పాల్గొన్నారు.

రూ. కోట్లతో

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్దనరెడ్డి

బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో త్రీఫేజ్‌ విద్యుత్‌ ప్రారంభం

Advertisement
Advertisement