రిమ్స్‌లో ఉద్యోగం పేరుతో మోసం | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో ఉద్యోగం పేరుతో మోసం

Published Tue, Dec 19 2023 1:46 AM

 స్పందనలో మాట్లాడుతున్న ఎస్పీ మలికాగర్గ్‌  - Sakshi

ఒంగోలు టౌన్‌: రిమ్స్‌లో జూనియర్‌ అసెస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఒంగోలుకు చెందిన నూతలపాటి అనిల్‌ కుమార్‌, దోర్నాలకు చెందిన బత్తుల రమణయ్యలు రూ.2 లక్షలు తీసుకొని మోసం చేశారని దోర్నాలకు చెందిన వ్యక్తి ఎస్పీ మలికా గర్గ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఎస్పీని కలిసిన ఆయన తన గోడు వెల్లబోసుకున్నాడు. ఉద్యోగం రాక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. లక్ష రుపాయల రుణం కోసం 96 వేల రుపాయలను ఖర్చు చేశాడో బాధితుడు. టంగుటూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌కు ఇన్‌స్టెంట్‌ పర్సనల్‌ లోన్‌ మేసెజ్‌ వచ్చింది. లింక్‌ ఓపెన్‌ చేసి రూ.లక్ష రుణానికి దరఖాస్తు చేశారు. లోన్‌ మంజూరు చేయడానికి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలంటూ ఆన్‌లైన్‌ మోసగాళ్లు విసరిన వలలో పడ్డాడు సదరు బాధితుడు. విడతల వారీగా రూ.96,146లను ఫోన్‌ పే, పేటీఎంల ద్వారా చెల్లించుకున్నాడు. అయినా ఇంకా డబ్బులు కట్టమని మెసెజ్‌లు వస్తుండడంలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హోల్డ్‌లో ఉన్న తమ డబ్బులను ఇప్పించాలని కోరారు. మొత్తం 120 మంది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సమస్యలను విన్న ఎస్పీ వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో మాట్లాడారు. చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ విక్రం శ్రీనివాసరావు, దిశ డీఎస్పీ శ్రీనివాసరావు, ఐసీసీఆర్‌ సీఐ దుర్గాప్రసాద్‌, ప్యానెల్‌ ఆడ్వకేట్‌ బీవీ శివరామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement