మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం కృషి

Published Sun, Feb 4 2024 12:22 AM

సింగరాయకొండ: డ్వాక్రా రుణ మాఫీ చెక్కు అందజేస్తున్న మంత్రి సురేష్‌ - Sakshi

సింగరాయకొండ (టంగుటూరు): రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిహిళా సాధికారికతకు, ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో నాలుగు విడతలుగా వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేశారని తెలిపారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్‌ జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగిన వైఎస్సార్‌ ఆసరా 4వ విడత సంబరాల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రాష్ట్రంలో సుమారు 8 లక్షల డాక్రా గ్రూపులుండగా 80 లక్షలకు పైగా లబ్ధిదారులున్నారని వీరికి సుమారు 25 వేల కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చేశారన్నారు. నియోజకవర్గంలో 6,057 గ్రూపులకు సుమారు 200 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందన్నారు. నాలుగో విడతలో ఒక్క సింగరాయకొండ మండలంలో 1,291 డ్వాక్రా గ్రూపులు ఉండగా 12,546 మంది గ్రూపు మహిళలకు రూ. 10.07 కోట్లను రుణమాఫీ కింద అందించారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో అనంతపురం సభలో డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేసి వారు కోల్పోయిన బంగారు నగలు, పుస్తెలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడని కానీ..కేవలం ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు అందించారని విమర్శించారు. అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేకపోతే వారి ఉసురు తగులుతుందని అందుకు చంద్రబాబే నిదర్శనమన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌పై నమ్మకంతో అక్కచెల్లెమ్మలు 175 సీట్లకు 151 కట్టబెట్టారని జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేశారన్నారు. కానీ చంద్రబాబు తప్పిన మాటకు శిక్షగా టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కూడా మహిళలంతా వైఎస్సార్‌ సీపీకి అండగా నిలిచి కొండపిలో తన గెలుపునకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డ్వాక్రా మహిళలకు 10.07 కోట్ల రూపాయల వైఎస్సార్‌ ఆసరా చెక్కులు, 2.02 కోట్ల రూపాయల సీ్త్రనిధి చెక్కులు, రుణాల చెక్కులను అందజేశారు. ముందుగా పీఎంఈజీపీ లబ్ధిదారుడు వాయిల తాతయ్యకు 10 లక్షల రూపాయల విలువ గల యూనిట్‌ను అందించారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యన్నాబత్తిన అరుణ, ఎంపీపీ కట్టా శోభారాణి, డీఆర్‌డీఏ పీడీ వసుంధర, ఏరియా కోఆర్టినేటర్‌ సనిత, ఏంపీడీఓ టి. నాగేష్‌కుమారి, ఏపీఎం డి. జయరాజ్‌, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఢాకా పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు, వైస్‌ ఎంపీపీ సామంతుల రవికుమార్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ప్రధాన కార్యదర్శి యన్నాబత్తిన చిన్న, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శీలం రాము, పలువురు నేతలు మలినేని వెంకటేశ్వర్లు, తన్నీరు సుబ్బారావు, షేక్‌ షకీలా, గోళ్లమూడి అశోక్‌కుమార్‌రెడ్డి, ఏపూరి శ్రీనివాసులు, కొండూరి అంకయ్య, బల్లెకూర బ్రహ్మయ్య, షేక్‌ పటేల్‌, షేక్‌ సుల్తాన్‌, పఠాన్‌ రియాజ్‌, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, షేక్‌ కరీం, షేక్‌ సలీం బాషా, షేక్‌ సలీం, శైలజ, గౌరవరపు నాగేశ్వరరెడ్డి, మహిళలు, ప్రజాప్రతినిధులు, పార్టి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ సురేష్‌ వైఎస్సార్‌ ఆసరా 4వ విడత సంబరాల్లో వ్యాఖ్య

జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యన్నాబత్తిన అరుణ
1/1

జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యన్నాబత్తిన అరుణ

Advertisement
Advertisement