Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ap Elections 2024 May 21 Political Updates Telugu
May 21st: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 21st AP Elections 2024 News Political Updates8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్‌ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌ డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడుఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన‌ సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల‌ మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్ష‌న్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్‌ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్‌ స్కామ్‌లోనూ బాబు దుబాయ్‌ బంధంఈసారి అదే షెల్‌ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్‌ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి

Karnataka Police Investigation Over Bangalore Rave Party
బెంగళూరు రేవ్‌ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రేవ్‌ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్‌ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్‌సెట్‌ టూ సన్‌రైజ్‌ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్‌ బూకీ వాసు వ్య‍క్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌ మొత్తానికి అరుణ్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వాసు బర్త్‌డే పార్టీకి డగ్ర్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌ కూడా రావడంతో డ్రగ్స్‌ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్‌ పార్టీ ఇచ్చిన క్రికెట్‌ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్‌ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్‌ ఫామ్‌హాస్‌లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్‌ పార్టీపై రైడ్‌ సందర్భంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్‌, సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్‌పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్‌ స్క్వాడ్‌ను​ పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట రేవ్‌ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. చిత్రంలో ఎస్పీ రమాదేవి
బదిలీలతో బరితెగింపు

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్‌ బృందం ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌­కుమార్‌ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్‌ అధి­కా­రుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్‌ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్‌ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్‌ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్‌ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్‌సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్‌ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్‌ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్‌ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 94 మందికి సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.

BJP Sends Show Cause Notice To MP Jayant Sinha
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్‌ నోటీసులు

రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్‌ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్‌ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్‌ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్‌ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్‌ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్‌, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్‌ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్‌ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్‌ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

10 Percent Job Layoffs In Tesla
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్‌ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ ఎలోన్‌ మస్క్‌ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్‌ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్‌ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్‌ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్‌, హెచ్‌ఆర్‌తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు.

Chandrababu is going to America for medical tests
ఇట్లు.. ఇటలీకి!

సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్‌ తర్వాత సైలెంట్‌చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్‌మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన తర్వా­త చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్‌ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్‌ విమా­¯­é­శ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఇమ్మి­గ్రే­షన్‌ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకో­వడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రే­షన్‌ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటి­కప్పుడు సమాచారం ఇచ్చిన­ట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్‌ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్‌ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్‌ స్కామ్‌లోనూ దుబాయ్‌ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్‌ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న స్కిల్‌ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసాని, కిలారి రాజేశ్‌ దుబాయ్‌ నుంచే అక్రమ నిధులను సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌లోని షెల్‌ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్‌ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్‌ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్‌ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్‌ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్‌ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్ర­బాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

Rasi Phalalu 21-05-2024 Telugu
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.21 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. మేషం: ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం: నూతన ఉద్యోగాలు లబిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.తుల: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.వృశ్చికం: పరిస్థితులు అంతగా కలసిరాదు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.మీనం: కుటుంబంలో ఇబ్బందులు. సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

IPL 2024: Top-heavy Kolkata Knight Riders and Sunrisers Hyderabad collide for a place in the final
IPL 2024: ఫైనల్‌ వేటలో ఎవరిదో జోరు!

అహ్మదాబాద్‌: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్‌’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్‌ ధమాకాలతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్‌ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్‌ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్‌ ప్రస్తుత సీజన్‌లో భీకరమైన ఫామ్‌ దృష్ట్యా టైటిల్‌ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్‌ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్‌ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్‌ తీసుకోకుండా ఫైనల్‌ బెర్త్‌ సాధించాలని ఆశిస్తోంది. సన్‌ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్‌ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్‌ హెడ్‌ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్‌–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్‌ శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్‌ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్‌ రైడర్స్‌ ఫిల్‌ సాల్ట్‌–సునీల్‌ నరైన్‌ ఓపెనింగ్‌ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్‌ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్‌ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్‌ అయ్యర్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, నితీశ్‌ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్‌ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్‌–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తిలు నైట్‌రైడర్స్‌ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్‌ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిõÙక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్‌. కోల్‌కతా: శ్రేయస్‌ అయ్యర్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్‌ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్‌ రాణా, వరుణ్, అనుకుల్‌/వైభవ్‌. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్‌ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్‌ (గుజరాత్‌ 89 ఆలౌట్‌; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్‌ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలుపొందాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్‌ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్‌ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.

Payal Rajput Ready To Settlement With Rakshana Movie Team
వారి ఫోన్‌ కాల్‌ కోసం ఎదరుచూస్తున్న పాయల్‌ రాజ్‌పుత్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్‌ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ చెల్లించకుండానే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంపై చిత్ర యూనిట్‌ కూడా రియాక్ట్‌ అయింది. ప్రమోషన్స్‌కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.సెటిల్మెంట్‌ కోరుకుంటున్న పాయల్తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ మరోసారి తన సోషల్‌ మీడియాలో ఒక నోట్‌ రాసింది. 'నేను డైరెక్టర్‌, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్‌కు నేను సపోర్ట్‌ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్‌ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్‌.. నేను ఎవరికీ అపకారం చేయను. రక్షణ టీమ్‌ నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్‌ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్‌ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్‌ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

NRI Dr Vasudeva Reddy Fire On US Doctor Lokesh
దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే..

సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌కు అలవాటని ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్‌ ఇటీవల గన్నవరం విమా­నాశ్రయంలో లండన్‌కు వెళుతున్న సీఎం జగన్‌ను అడ్డు­కు­నేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్‌ వాసు­దేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటు. ప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌ డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడు. ఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది. ప్రాక్టీస్‌పైనా నిషేధం వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement