డైరెక్టర్‌ వేణు మంచి మనసు.. ‘బలగం’ సింగర్‌కు ఆర్థిక సాయం

18 Mar, 2023 00:06 IST|Sakshi
బుర్రకథ కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యను సన్మానిస్తున్న ‘బలగం’ దర్శకుడు వెల్దండి వేణు

వరంగల్‌ జిల్లా : సిరిసిల్లకు చెందిన సినీ హాస్యనటుడు, ‘బలగం’ చిత్ర దర్శకుడు యెల్దండి వేణు మానవత్వం చాటుకున్నారు.‘బలగం’ సినిమాలో క్లైమాక్స్‌లో బుర్రకథతో అందరి హృదయాలను కదిలించారు కొమురవ్వ, మొగిలయ్య. కళాకారుడు మొగిలయ్య కిడ్నీలు పాడై డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లు తెలియడంతో చిత్ర దర్శకుడు యెల్దండి వేణు స్పందించారు.

వరంగల్‌ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్య ఇంటికి వెళ్లి రూ.లక్ష ఆర్థికసాయంగా అందజేశారు. చిత్ర నిర్మాత దిల్‌రాజ్‌తో మరింత ఆర్థికసాయం అందేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా వారిని వేణు సన్మానించారు. సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్‌, పాటల రచయిత శ్యామ్‌ కాసర్ల, యాంకర్‌ గీత భగత్‌, దార్ల సందీప్‌, సామాజిక వేత్త కాయితి బాలు, నర్సంపేట సీఐ పులి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు