పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published Sun, Mar 26 2023 1:38 AM

అధికారులతో సమావేశమైన ఈవో  - Sakshi

రుద్రంగి(వేములవాడ): పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని డీఐఈవో సీహెచ్‌.మోహన్‌ పేర్కొన్నారు. శనివారం రుద్రంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఈసీ–1 రాజేశ్వర్‌రావు, డీఈసీ–2, కళాశాల ప్రిన్సిపాల్‌ పులి గంగయ్య, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ మడుపు నవీన్‌రెడ్డి, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ సురేష్‌, ఇన్విజిలేటర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

రాములోరి పెళ్లి ఘనంగా నిర్వహిస్తాం

వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో ఈనెల 30న సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈవో కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఇందుకు అన్ని విభాగాల అధికారుల సహాయ సహకారాలు అవసరమని, గతంలోకంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, సెస్‌, ఎకై ్సజ్‌, ఫైర్‌ శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. చైర్మన్‌ చాంబర్లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కల్యాణోత్సవ వేదిక, రథోత్సవం ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తామన్నారు. తహసీల్దారు రాజారెడ్డి, టౌన్‌ సీఐ వెంకటేశ్‌, స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, ఏఈవో బి.శ్రీనివాస్‌, ప్రతాప నవీన్‌, జయకుమారి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ సిరిసిల్లలో మహిళలే కీలకం

సిరిసిల్లటౌన్‌: స్వచ్ఛ సిరిసిల్లలో మహిళల పాత్ర కీలకమైందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌–2023లో భాగంగా మున్సిపల్‌ ఆధ్వర్యంలో స్వశక్తి గ్రూపుల సభ్యులు, మహిళ కౌన్సిలర్లతో స్వచ్ఛత ప్రదర్శన నిర్వహించగా ఆమె మాట్లాడారు. తడి, పొడి, హానికర చెత్తపై ప్రజల్లో చైతన్యం నింపాలన్నా రు. వరుసగా జాతీయ అవార్డులు సాధిస్తున్న సిరిసిల్ల ఈ ఏడాది కూడా అదే పరంపర కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు మహిళలు, స్వశక్తి సభ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు.

కల్యాణలక్ష్మి దేశానికే ఆదర్శం

సిరిసిల్లఅర్బన్‌: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు దేశానికే ఆదర్శమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి 12వ వార్డు చంద్రంపేటలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పఠనాశక్తిని పెంచేందుకు పుస్తకాలు దోహదం

సిరిసిల్లఎడ్యుకేషన్‌: విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు పుస్తకాలు దోహదం చేస్తాయని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ అన్నారు. సిరిసిల్ల శివనగర్‌ పాఠశాలకు పీజీఎన్‌ఎఫ్‌ (ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై ఫోరం) వారిచే రూ.50 వేల విలువగల వెయ్యి పుస్తకాలను పాఠశాల గ్రంథాలయానికి వితరణ చేయగా, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఈవో రమేశ్‌ మాట్లాడుతూ, పుస్తకాలు బాగా చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, విద్యార్థులు సొంతంగా పుస్తకాలు చదివి ఆలోచనత్మకంగా పరీక్షలు రాయగలుగుతారని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీ పరబ్రహ్మమూర్తి, మారసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగొండ రవి, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement