విదేశీ ఉద్యోగ మేళాకు స్పందన | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగ మేళాకు స్పందన

Published Sat, Jun 10 2023 12:46 AM

ఉద్యోగ మేళాకు హాజరైన నిరుద్యోగులు - Sakshi

రామగుండం: విదేశాల్లో ఉద్యోగాలు కల్పించాల నే ఉద్దేశ్యంతో రామగుండంలోని ఐటీఐలో శుక్రవారం ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళాకు స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కాం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మే ళాకు నాలుగు జిల్లాల నుంచి 130 మంది హాజరయ్యారు. వీరికి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లోగా సమాచారం ఇస్తామని వెల్లడించారు.

ఇంటర్వ్యూలు నిర్వహించిన ఉద్యోగాల వివరాలు..

ఆస్ట్రేలియాలో ప్లాంట్‌ మెకానిక్‌, మెకానికల్‌ ఫిట్టర్‌, మెకానికల్‌ ఇంజినీర్‌, వెల్డర్‌, బైలర్‌ మేకర్‌, ఫ్యాబ్రికేటర్‌, జర్మనీలో ఆస్‌బిల్డంగ్‌ ప్రోగ్రామ్స్‌, కన్‌స్ట్రక్షన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (నాన్‌వెజ్‌), రిటైల్‌ సేల్స్‌, వేర్‌హౌస్‌ క్లర్క్‌, ట్రక్‌ డ్రైవర్స్‌, వెసెల్‌ కంటైనర్‌ మేకింగ్‌, పోలాండ్‌లో వెల్డర్స్‌, ఫిట్టర్స్‌, యూఏఈలో ఫోర్‌మెన్‌ ప్లాంటర్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌, వర్క్‌ ప్రిపరేటర్‌ పైపింగ్‌, వర్క్‌ ప్రిపరేటర్‌–స్ట్రక్చరల్‌, ఫోర్‌మెన్‌ రబ్బర్‌ ప్రొపెల్లర్‌, ప్లాటర్‌ ఫ్యాబ్రికేటర్‌, పైపింగ్‌ సూపర్‌వైజర్‌, బ్లాస్టింగ్‌, వెల్డర్‌, ఫోర్‌మెన్‌ మెకానికల్‌ తదితర ఖాళీలకు అభ్య నుంచి ఇంట ర్వ్యూ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు.

ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం..

నేను మైనింగ్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం ప్రైవేటుగా జాబ్‌ చేస్తున్న. విదేశాల్లోని మైనింగ్‌ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఉంది. టామ్‌కాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలనే విషయాన్ని వారికి తెలిపా. – శ్రీవెంకటేశ్వర,

గుంజపడుగు. పెద్దపల్లి జిల్లా

ఆఫ్రికాలో ఉద్యోగం కల్పించాలని..

నేను ఐటీఐలో ఫిట్టర్‌ పూర్తి చేసి గోదావరిఖనిలో అప్రెంటిషిప్‌ చేస్తున్న. విదేశాల్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వచ్చా. పెళ్లికి ముందే ఐదేళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి వస్తే ఆర్థికంగా బాగుంటుంది. ఆఫ్రీకా దేశంలో ఉద్యోగం కల్పించాలని కోరా.

– బండారి అవినాశ్‌, ఖమ్మం

ఇంటర్వ్యూకు రావడం మొదటిసారి

నేడు ఐటీఐలో ఎలక్ట్రిషియన్‌ పూర్తి చేసి మంచిర్యాల సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిషిప్‌ చేస్తున్న. నా అర్హతకు సంబంధించి ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేశా. అబ్రాడ్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూకు రావడం ఇదే మొదటిసారి.

– తుమ్మ వైష్ణవి, మంచిర్యాల

అర్హతలున్న వారందరికీ ఉద్యోగం కల్పిస్తాం

ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హతలున్న వారందరికీ విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. మేళాకు వచ్చిన వారి నుంచి స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తాం. పరిశీలించి మళ్లీ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తాం. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు ప్రయివేటు కన్సల్టెంట్లను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వ పక్షాన నిర్వహించే మేళాకు హాజరైతే తక్కువ ఖర్చుతో వెళ్లొచ్చు.

– శ్రావణి తలశిల, హెచ్‌ఆర్‌ మేనేజర్‌, టామ్‌కాం

15 ఏళ్లు అరబ్‌ దేశాల్లో పనిచేశా

నేను పదిహేనేళ్లు వివిధ అరబ్‌ దేశాల్లో పనిచేసి కొన్ని పనుల నిమిత్తం ఇండియాకు తిరిగి వచ్చా. ప్రస్తుతం నాన్‌ అరబ్‌ దేశాల్లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న. నా అర్హత, విదేశాల్లో చేసిన పనులు తదితర ధ్రువీకరణపత్రాలు అందజేశా.

– ఎండీ.సాధిఖ్‌, సిరిసిల్ల

తగిన ఉద్యోగం వస్తే చాలు

నేను బీఎస్సీ (ఎంసీసీఎస్‌) చదివా. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీ టామ్‌కాం కావడంతో నమ్మకంతో విదేశాల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా. వివరాలన్నీ నమోదు చేసుకొని పది రోజుల్లోగా సమాచారం ఇస్తామన్నారు.

– మేర్గు సాగర్‌గౌడ్‌,

పెద్దంపేట, పెద్దపల్లి జిల్లా

నాలుగు జిల్లాల నుంచి హాజరైన 130 మంది

ప్రత్యేక ఇంటర్వ్యూ అనంతరం వివరాల నమోదు

వారం రోజుల్లో సమాచారమిస్తామని వెల్లడి

అబ్రాడ్‌లో ఉద్యోగం చేయాలని..

నేడు డిగ్రీ చదివా. ప్రస్తుతం హెవీ వెహికల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న. ఉద్యోగం చేయాలనే కోరిక ఉంది. పత్రికల్లో వచ్చిన ప్రకటనను చూసి ఇంటర్వ్యూకు వచ్చా. ధ్రువీకరణపత్రాలు సమర్పించ. మూడురోజుల్లో కాల్‌ చేస్తామన్నారు. – ఎండీ.సాజిద్‌ అహ్మద్‌, మంచిర్యాల

1/7

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
Advertisement