రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

10 Nov, 2023 04:54 IST|Sakshi

చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ సెకండియర్‌ చదువుతున్న సర్ధార్‌ వేణు రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఈమేరకు గురువారం కాలేజీ ప్రిన్సిపాల్‌ మల్లేశం, అధ్యాపకులు అభినందించారు.

వైఎస్సార్‌టీపీ వెంటే క్యాడర్‌

పార్టీ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): వైస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము పార్టీ మారారని.. క్యాడర్‌ అంతా పార్టీ వెంటే ఉంటుందని ఆ పార్టీ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు పూర్మాణి కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాల వైఎస్‌.శర్మిల ఆదేశాలనుసారం నడుచుకుంటామన్నారు. పార్టీ యూత్‌ మండలాధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, బీసీ అధ్యక్షుడు రాచర్ల రాజు, నాయకులు రమేశ్‌, నాగరాజు, ఎల్లయ్య, వెంకటరెడ్డి, వెంకటేశ్‌, తిరుపతి, కరుణాకర్‌, పర్శరాములు పాల్గొన్నారు.

షాహిదాకు ఆర్థిక సాయం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని బండలింగంపల్లికి చెందిన నిరుపేద మహిళ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమెకు చికిత్స కోసం దాతలు ఆర్థికసాయం చేస్తున్నారు. గత నెల 28న ‘సాక్షి’లో వచ్చిన ‘ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు’ అనే కథనానికి స్పందిస్తున్న దాతలు సాయమందిస్తున్నారు. షాహీదా ఆరోగ్యం బాగుపడడానికి చికిత్స కోసం రూ.2.50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చేతిలో చిల్లి గవ్వలేక ఆర్థికసాయం చేయాలని కోరడంతో పలువురు స్పందిస్తున్నారు. మై వేములవాడకు చెందిన చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు గురువారం రూ.10వేల సాయం అందించారు.

శిక్షణ ఐపీఎస్‌ను

సన్మానించిన ఎస్పీ

జగిత్యాలక్రైం: కోరుట్ల మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన ఏనుగు శివమారుతిరెడ్డి యూపీఎస్సీ సివిల్స్‌లో 131వ ర్యాంక్‌ సాధించి ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా శివమారుతిరెడ్డి కలిశారు. ఎస్పీ అతడితో పాటు ఆయన తండ్రి అంజిరెడ్డిని ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు