శాంతియుతంగా ఎన్నికలు | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా ఎన్నికలు

Published Sun, Nov 12 2023 12:48 AM

- - Sakshi

● ఎస్పీ అఖిల్‌మహాజన్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్‌ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం కవాతు చేపట్టారు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, అల్మాస్‌పూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లోని సాధారణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ తనిఖీ చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డిపేట ఠాణా పరిధిలోని సాధారణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పలు సూచ నలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాల ఆధ్వర్యంలో కవాతులు నిర్వహించి, ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రమాకాంత్‌ పాల్గొన్నారు.

శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకోవాలి

సిరిసిల్లఎడ్యుకేషన్‌: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకుంటే వారు ఎంచుకున్న రంగాల్లో రాణించగలరని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అన్నారు. ఈనెల 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించే జాతీయ శాసీ్త్రయ దృక్పథ ప్రచారోద్యమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం ట్రస్ట్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. సీ్త్ర, పురుష తారతమ్యం సమాజ స్థాపన ప్రధాన ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు రంగినేని సుజాత మోహన్‌రావు, ఎడ్యుకేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత రంగినేని మోహన్‌రావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రం ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేశ్‌, జిల్లా కార్యదర్శి కట్కూరి రాజు, జిల్లా కమిటీ సభ్యులు పాండురంగం, మధుసూదన్‌ పాల్గొన్నారు.

బద్దెనపల్లి గురుకులాన్ని సందర్శించిన డీఈవో

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బద్దెనపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శనివారం జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలో ఉన్న వనరులను ఉపయోగించుకుని చదువులో రాణించాలని.. విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ప్రిన్సిపాల్‌ దర్శనాల పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇసుకదందాపై ప్రతిపక్షాలు ప్రతిఘటించాలి

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లలో అధికార పార్టీకి చెందిన నేతలు, బంధువులు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రతిపక్షాలు ప్రతిఘటించాలని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్రకమిటీ సభ్యుడు ఒల్లాల కిశోర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ నేత రాత్రి వేళలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను ఫొటోలు, వీడియోలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీనిపై అధికార పార్టీ నేత బంధువు ఫోన్‌లో బె దిరింపులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. వెంటనే సదరు నాయకుడు క్షమాపణ లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు స్పందించి దొంగ ఇసుక రవాణాను అరికట్టా లని, బాధ్యులపై చట్టరీత్య చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. ఏఐఎఫ్‌టీయూ నాయకులు సోమిశెట్టి దశరథం, రవీందర్‌, సలేంద్రి ఎల్లయ్య, దేవదాసు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జేవీవీ నేతలు
1/2

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జేవీవీ నేతలు

2/2

Advertisement
Advertisement