చేతినిండా పని | Sakshi
Sakshi News home page

చేతినిండా పని

Published Wed, Nov 15 2023 1:30 AM

- - Sakshi

సిరిసిల్లలో పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లతో నేతన్నలకు చేతినిండా పని లభిస్తుంది.

● 250 మంది నేతకార్మికులు, జెండాలను కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు, మగవారు ఉపాధి పొందుతున్నారు.

● కండువా నాణ్యతను బట్టి రూ.3 నుంచి రూ.60 వరకు ఉంటుంది.

● జెండాలకు రూ.4 నుంచి రూ.180, టోపీ(క్యాప్‌)లకు రూ.5 నుంచి రూ.40 వరకు, తోరణాల జెండాలు 10వేల జెండాలకు రూ.8,000 నుంచి రూ.15,000 వరకు అమ్ముతున్నారు. బహిరంగ సభలకు వినియోగించే బ్యానర్లు ముద్రణ ఫ్లెక్సీ ప్రభావంతో నిలిచిపోయింది.

Advertisement
Advertisement