సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా | Sakshi
Sakshi News home page

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

Published Fri, Nov 17 2023 12:50 AM

మర్రిగడ్డలో ప్రచారం చేస్తున్న వికాస్‌రావు - Sakshi

● నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ● వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు

చందుర్తి(వేములవాడ): నిస్వార్థంతో సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని.. ఎలాంటి మచ్చ లేని నాయకునిగా ప్రజలందరూ ఆదరించి పువ్వు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చందుర్తి మండలం ఎన్గల్‌, బండపల్లి, మర్రిగడ్డ, లింగంపేట, సనుగుల, దేవునితండా, రామరావుపల్లె, కిష్టంపేట, జోగాపూర్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని మంత్రి కేటీఆర్‌ మాటలే చెబుతున్నాయని, వేములవాడను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ప్రకటించారని, పదేళ్లకు గుర్తుకు రాని అభివృద్ధి ఎన్నికలకు ముందు ఓట్లు రాజకీయంగా గుర్తించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పాలనలో మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం, సిరిసిల్ల, సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలను అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు అల్లాడి రమేశ్‌, జిల్లా కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ మార్త సత్తయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేశ్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌, బీజేవైఎం జిల్లా కార్యదర్శి విజేందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఒక్కసారి గెలిపిస్తే.. ఐదేళ్లు మిమ్మల్ని గెలిపిస్తా

రుద్రంగి: ఒక్కసారి నన్ను గెలిపిస్తే నిస్వార్ధంగా పరిపాలన సాగిస్తూ ఐదేళ్లు మీకు సేవ చేస్తూ మిమ్మల్ని గెలిపిస్తానని వేములవాడ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావు అన్నారు. గురువారం రుద్రంగి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్‌ వరకు ర్యాలీ తీశారు. అభ్యర్థిగా మొదటిసారి రు ద్రంగికి వచ్చిన వికాస్‌రావుకు గ్రామ ప్రజలు, మ హిళలు డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాలు, మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వికాస్‌రావు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజన్నను దత్తత తీసుకునే వారు ఇంకా పుట్టలేరని, వికాశ్‌రావును గెలిపిస్తే వేములవాడనే ఇతర నియోజకవర్గాలను దత్తత తీసుకునే స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఇదివరకే ఉచిత వైద్య శిబిరాలు పెట్టి నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేశామని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టా మని గుర్తు చేశారు. రాజకీయాలల్లోకి స్వార్ధం కోస ం రాలేదని ప్రజలకు సేవ చేయాలని వచ్చానని, నా కోసం రాలేదు మీ కోసం వచ్చానని అన్నారు. నాపైన అవినీతి ఆరోపణలు లేవని, ఇతరుల లాగా భూకబ్జాలు లేవని తెలిపారు. ఓబీసీ జిల్లా అధ్యక్షు డు నంద్యాడపు వెంకటేశ్‌, మాజీ సెస్‌ డైరెక్టర్‌ అల్లాడి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుల ఇంటింటా ప్రచారం

కొలనూర్‌, మర్తనపేట, ధర్మారం గ్రామాల్లో బీజేపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్థి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రావు, నాయకులు గొట్టె రామచంద్రం, బైరగోని సురేశ్‌, మిర్యాల్‌కార్‌ బాలాజీ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన మాజీ కౌన్సిలర్‌

రాపెల్లి లావణ్యశ్రీధర్‌

వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ రాపెల్లి లావణ్యశ్రీధర్‌లు గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పార్టీ అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావులు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షుడిగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. నాయకులు కుమ్మరి శంకర్‌, రేగుల మల్లికార్జున్‌, సంటి మహేశ్‌, అన్నారం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement