ప్రణాళికతో ప్రశాంతంగా ఎన్నికలు | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో ప్రశాంతంగా ఎన్నికలు

Published Fri, Nov 17 2023 12:50 AM

వైన్స్‌ను తనిఖీ చేస్తున్న విజయ్‌భాస్కర్‌రెడ్డి - Sakshi

సిరిసిల్లక్రైం: పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించవచ్చని ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు వినిత సాహూ అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండస్వామి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి సమీక్షించారు. పోలీంగ్‌కు ముందు, పోలింగ్‌ రోజున, పోలింగ్‌ తర్వాత తీసుకోవాల్సిన భద్రత చర్యలు, ఈవీఎం, స్ట్రాంగ్‌రూం భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతీపౌరుడు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా నమ్మకాన్ని కలిగించడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఉచితాల సరఫరాపై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులపై జిల్లాలో పోలీస్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు రూ.75.50 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు వివరించారు. 582 కేసుల్లో 1503 మందిని బైండోవర్‌ చేసి ప్రశాంతతకు ఎలాంటి అవరోధాలు రాకుండా చూసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, ఎకై ్సజ్‌ అధికారి పంచాక్షరి, డీఎస్పీలు ఉదయ్‌రెడ్డి, రవికుమార్‌, సీఐలు, ఆర్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా పనిచేయాలి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)/గంభీరావుపేట: ఎన్నికల సమయంలో ఎకై ్సజ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పారదర్శకంగా పనిచేయాలని ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేటలో గురువారం వాహనాలు, వైన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం అక్రమ రవాణా, కొనుగోళ్లపై నిఘా ఉంచాలని, వైన్స్‌లోని స్టాక్‌ రిజిష్టర్లు, మద్యాన్ని పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. మద్యం విషయంలో వచ్చే ప్రతీ ఫిర్యాదుపై స్పందించాలని ఆదేశించారు. ఈఎస్‌ పంచాక్షరి, సీఐ చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా సరిహద్దు పెద్దమ్మ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో గురువారం ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి తనిఖీలు చేశారు.

మాట్లాడుతున్న వినిత సాహూ
1/1

మాట్లాడుతున్న వినిత సాహూ

Advertisement

తప్పక చదవండి

Advertisement