ఆధ్యాత్మిక పట్టణం.. సమస్యల నిలయం | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక పట్టణం.. సమస్యల నిలయం

Published Sun, Nov 19 2023 1:26 AM

వేములవాడలో ఇళ్ల మధ్య మురుగునీరు - Sakshi

● వేములవాడలో అన్నీ సమస్యలే.. ● ఇబ్బందులు పడుతున్న స్థానికులు ● కంపుకొడుతున్న కాలనీలు ● ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌

వేములవాడఅర్బన్‌: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పట్టణంలో ఎటూ చూసిన సమస్యలే కనిపిస్తున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులకు వసతులు, పట్టణంలో రహదారులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకురోడ్లు, ఉన్న రోడ్లు గతుకులతో అధ్వానంగా మారడం, ఆలయ ఆవరణలో ఎక్కడ చూసినా వాహనాల పార్కింగ్‌తో అవస్థలు పడుతున్నారు. వేములవాడలో డ్రెయినేజీలు సక్రమంగా లేక మురికి కంపు కొడుతోంది.

మురికి కంపు

● వేములవాడలోపలు వార్డుల్లో డ్రెయినేజీ సరి గ్గా లేక ఇళ్ల మధ్యలో మురికినీరు నిలుస్తుంది.

● దోమలతో ఇబ్బందిగా మారిందని ఫాగింగ్‌ చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

● వేములవాడ అర్బన్‌ కాలనీ, సాయిబాబా ఆలయం, చెక్కపల్లి బస్టాండ్‌ ప్రాంతాల్లోని మురికినీరు కట్టుకాలువ ద్వారా రాజన్న గుడి చేరువులోకి చేరుతుంది.

కనిపించని సీసీరోడ్లు

● వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు లేవు. వాహనాలు వెళ్తుంటే వెనుక దుమ్ము లేచి గృహాల్లోకి వస్తుండడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

● వర్షాకాలం మట్టి బురదతో వాహనాల మీద బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందంటున్నారు.

ఇరుకురోడ్ల్లతో ట్రాఫిక్‌జామ్‌

● వేములవాడ బస్టాండ్‌ తిప్పాపూర్‌లో మూడు చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌జామ్‌ అవుతోంది.

● వేములవాడ మూలవాగుపై రెండు వంతెనల పనులను ఏళ్ల క్రితం ప్రారంభించినప్పటికీ ఒక్కటే పూర్తయింది. మరొకటి మధ్యలోనే ఆగిపోయింది.

● రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండడంతోపాటు ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండగా పట్టణంలో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడుతుంది.

● మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్లు ఇరుకుగా ఉండడం, రాజన్న గుడి నుంచి బద్దిపోచమ్మ వరకూ గల ఇరుకురోడ్లతో భక్తులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌

● వేములవాడ రాజన్న అలయం చుట్టూ ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుతున్నారు.

● రాజన్న ఆలయం ముందు ప్రాంతంలో మెట్ల వద్ద వాహనాలు నిలుపుతున్నారు.

● అసలే ఇరుకురోడ్లు అందులో ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌తో భక్తులకు ఇబ్బందిగా మారింది.

● రాజన్న ఆలయ చెరువు కట్టపైన పార్కింగ్‌ స్థలం ఉన్నప్పటికీ అక్కడ వాహనాలు నిలపడం లేదు.

నిరుపయోగంగా మార్కెట్‌ భవనం

● వేములవాడలోని భగవంతరావునగర్‌లో రూ.2.70 కోట్లతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో అధునాతన వసతులతో కూడిన మార్కెట్‌ భవ నం నిర్మించారు. కూరగాయల వ్యాపారులకు అనుకులంగా స్టాల్స్‌ ఏర్పాట్లు చేసినా వినియోగించడం లేదు.

● ప్రస్తుతం కూరగాయాల మార్కెట్‌ రోడ్లపైనే కొ నసాగుతుంది. వేములవాడ మూలవాగు రెండో బైపాస్‌రోడ్డు పక్కన కూరగాయల మార్కెట్‌ నడుస్తుంది. ప్రభుత్వ కళాశాల ముందు రోడ్డుపై కూడా కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేశారు.

గుడిచెరువులోకి వెళ్తున్న మురికినీరు
1/2

గుడిచెరువులోకి వెళ్తున్న మురికినీరు

2/2

Advertisement
Advertisement