కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి

Published Sun, Dec 3 2023 12:40 AM

మొక్కలు నాటుతున్న కమాండెంట్‌ - Sakshi

● పరిశీలించిన ఎలక్షన్‌ అబ్జర్వర్స్‌

సిరిసిల్ల: జిల్లాలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి కలెక్టరేట్‌లో శనివారం కౌంటింగ్‌ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ జగదీశ్‌ సోన్‌కర్‌, ఎన్నికల కౌంటింగ్‌ పరిశీలకులు ఉదయన్‌సిన్హా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సమక్షంలో ర్యాండమైజెషన్‌ పూర్తయింది. అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.గంగయ్య, నోడల్‌ అధికారి రమేశ్‌కుమార్‌, ఈడీఎం శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

కమాండెంట్‌ శ్రీనివాసరావు

సిరిసిల్లక్రైం: పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న తరుణంలో మొక్కలు పెంచి, రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావు కోరారు. బెటాలియన్‌ ఆవరణలో శనివారం మొక్కలు నాటి మాట్లాడారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎ.జయప్రకాశ్‌నారాయణ, ఎం.పార్థసారథిరెడ్డి పాల్గొన్నారు.

కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి

గంభీరావుపేట(సిరిసిల్ల): కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. కాలేజీలో శనివారం కంప్యూటర్‌ లిటరసీ డే నిర్వహించారు. నిత్య జీవితంలో కంప్యూటర్‌ ఉపయోగాన్ని వివరించారు. అనంతరం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. వైస్‌ప్రిన్సిపాల్‌ పిట్ల దాసు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ధర్మపురి, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ శ్రీవల్లి, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ కన్వీనర్‌ శ్రావణ్‌, భిక్షమయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్‌, మనోహర్‌, కృష్ణప్రసాద్‌, రాజేశ్‌, శైలజ పాల్గొన్నారు.

నేడు మద్యం షాపులు బంద్‌

సిరిసిల్ల: సిరిసిల్ల ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం మద్యం షాపులు బంద్‌ పాటించాలని ఎకై ్సజ్‌ సీఐ గులాం ముస్తఫా శనివారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నేడు మద్యం, కల్లు దుకాణాలు బంద్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాలు ఆదివారం బంద్‌ పాటించాలని ఎకై ్సజ్‌ సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. ఈమేరకు సీఐ శనివారం మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని 14 మద్యం దుకాణాలతోపాటు కల్లు దుకాణాలను మూసివేయాలని సూచించారు. కౌంటింగ్‌ ముగిసే వరకు సీల్‌ వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం, కల్లు విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న అధికారులు
1/3

ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న అధికారులు

మాట్లాడుతున్న అధ్యాపకులు
2/3

మాట్లాడుతున్న అధ్యాపకులు

గులాం ముస్తఫా, సిరిసిల్ల ఎకై ్సజ్‌ సీఐ
3/3

గులాం ముస్తఫా, సిరిసిల్ల ఎకై ్సజ్‌ సీఐ

Advertisement
Advertisement