చెరువులో అక్రమ నిర్మాణం | Sakshi
Sakshi News home page

చెరువులో అక్రమ నిర్మాణం

Published Wed, Mar 29 2023 4:02 AM

జల్‌పల్లి చెరువు ఎఫ్‌టీఎల్‌లో కొనసాగుతున్న షట్టర్‌ నిర్మాణ పనులు - Sakshi

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతోంది. ఇటీవల చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఓ వ్యక్తి ఏకంగా షెట్టర్‌ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కావచ్చాయి. రోడ్డుకు సమీపంలో చెరువు ఉండడంతో అక్రమ నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. చెరువు పరిధిలో వ్యవసాయ భూములు ఉంటే వాటిని కేవలం సాగు మాత్రమే వినియోగించాలి. కానీ ఓ వ్యక్తి ఏకంగా కమర్షియల్‌ నిర్మాణాలు మొదలు పెట్టాడు. చెరువు కబ్జాకు గురికావడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. జల్‌పల్లి చెరువు పరిసరాల్లో కబ్జా విషయమై ఫిర్యాదు వచ్చింది. చెరువును పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే తమకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– జనార్దన్‌రావు,

తహసీల్దార్‌, బాలాపూర్‌

Advertisement
Advertisement