లోక్‌అదాలత్‌లో 369 కేసులు పరిష్కారం | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 369 కేసులు పరిష్కారం

Published Fri, Jun 2 2023 3:50 AM

- - Sakshi

చేవెళ్ల: లోక్‌అదాలత్‌లో డ్రంకన్‌డ్రైవ్‌ కింద 369 కేసులు పరిష్కారమయ్యాయి. మండల కేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో గురువారం మూడు పోలీస్‌స్టేషన్లకు సంబంధించి నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ కేసుల పరిష్కారం కోసం మెగా లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ లోక్‌అదాలత్‌ను రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సాంబశివరావుతోపాటు రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ శంకరయ్య పాల్గొన్ని ప్రారంభించారు. ఈ లోక్‌అదాలత్‌ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సాంబశివరావు మాట్లాడుతూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, మరోసారి ఇలాంటి కేసులు కాకుండా చూసుకోవాలని కక్షిదారులను ఆదేశించారు. మొదటిరోజు లోక్‌ అదాలత్‌లో 369 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. చేవెళ్ల డివిజన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ లోక్‌ అదాలత్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ సీఐ ఎన్‌. వాసు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎస్‌ఐ చందర్‌నాయక్‌, న్యాయవాది కె. మహేందర్‌గౌడ్‌, సివిల్‌ పోలీస్‌ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రిటైర్డ్‌ జడ్జి సాంబశివరావు, ట్రాఫిక్‌ ఏసీపీ శంకరయ్య

హాజరైన కక్షిదారులు

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తేనే ప్రమాదాల నివారణ

రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సాంబశివరావు

1/1

Advertisement
Advertisement