దోపిడీ | Sakshi
Sakshi News home page

దోపిడీ

Published Mon, Jun 5 2023 6:00 AM

అజీజ్‌నగర్‌ సమీపంలో నీళ్లు నింపుకొంటున్న భారీ వాటర్‌ ట్యాంకర్లు - Sakshi

సోమవారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2023
జల
యథేచ్ఛగా నీటి దందా
● జలాశయాల సమీపంలో బోర్లు ● ట్యాంకర్లలో నింపి తరలింపు ● వాల్టా చట్టానికి తూట్లు ● దర్జాగా ఉచిత విద్యుత్‌ వినియోగం ● నిద్రమత్తులో అధికారగణం

8లోu

మొయినాబాద్‌: జల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమంగా భూగర్భజలాలను తరలిస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు. జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నగరంలో నీటిని విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్యాంకర్లలో నీళ్లు తరలిపోతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మొయినాబాద్‌ మండలంలోని అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ గ్రామాల్లో అక్రమ నీటి దందా జోరుగా కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల సమీపంలో బోర్లు వేసి భూగర్భ జలాలలను తోడేస్తున్నారు. టార్పాలిన్లతో సంపులు ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపుతున్నారు. సంపుల్లో నుంచి వాటర్‌ ట్యాంకర్లలో నింపి నగరంలోని గచ్చిబౌలి, మణికొండ, కోకాపేట్‌, నార్సింగి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో నీటి వినియోగం భారీగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. జలాశయాల సమీపంలోని రైతుల బోర్లను లీజుకు తీసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రతి రోజు వందల ట్యాంకర్ల నీళ్లు తరలిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

బోర్లకు ఉచిత విద్యుత్‌..

నీటివ్యాపారానికి వాడుతున్న బోర్లకు అక్రమా ర్కులు ఉచిత విద్యుత్‌ను దర్జాగా వాడుకుంటున్నారు. వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇస్తుండడంతో ఆయా బోర్ల ద్వారానే నీటిని తోడుతున్నారు. తోడిన నీటిని సంపుల్లో నింపి.. సంపుల్లో నుంచి మరో మోటార్‌ ద్వారా ట్యాంకర్లలో నింపుతున్నారు. సంపుల్లో వాడే మోటార్లకు మాత్రం బిల్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ ట్యాంకర్ల ద్వారా..

అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ రెవెన్యూల్లో నుంచి భారీ వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఒక్కో వాటర్‌ ట్యాంక్‌ సామర్థ్యం 40 వేల లీటర్లకు పైనే ఉంది. ఇంత భారీ వాటర్‌ ట్యాంకులు వెళ్తుండడంతో రోడ్లు సైతం దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు. అక్రమంగా నీటి వ్యాపారం చేస్తూ నీటిని తరలిస్తున్నవారిపై సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

చర్యలు తీసుకుంటాం

బోర్లు వేసి భూగర్భ జలాలలను తోడి అమ్ముకుంటూ వ్యాపారం చేయడం వాల్టా చట్టానికి విరుద్ధం. హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల సమీపంలో నుంచి బోర్ల ద్వారా నీటిని తోడి తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటాం.

– అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌, మొయినాబాద్‌

నీటిని తరలిస్తున్న భారీ ట్యాంకర్‌
1/2

నీటిని తరలిస్తున్న భారీ ట్యాంకర్‌

గణపతి (ఫైల్‌)
2/2

గణపతి (ఫైల్‌)

Advertisement
Advertisement