No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Sep 12 2023 5:44 AM

-

పరేడ్‌ గ్రౌండ్‌కు అమిత్‌షా

ఈనెల 17న తెలంగాణ విమోచనదినాన్ని పురస్కరించుకుని రక్షణశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా నిర్వహించనున్న జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ సభకు పోటీగా బీజేపీ శ్రేణులు కూడా ఈ వేడుకలకు భారీగా జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, ముషీరాబాద్‌, అంబర్‌ పేట్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, కల్వకుర్తి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి కనీసం యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు బూత్‌ కమిటీల వారీగా టార్గెట్లు కూడా ఇచ్చారు.

మాసబ్‌ట్యాంక్‌లో ఎంఐఎం ర్యాలీ, సభ

ప్రధాన పార్టీలతో పాటు ఎంఐఎం సైతం సెప్టెంబర్‌ 17న ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. జాతీ య సమైక్యత దినోత్సవం పేరుతో నాంపల్లిలోని దర్గా యూసఫియన్‌ నుంచి బైక్‌ర్యాలీ చేపట్టి, మా సబ్‌ ట్యాంక్‌లోని హాకీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఎంఐఎం ముఖ్య నేత అసదుద్దీన్‌ ఓవైసీ సహా పార్టీ ప్రముఖులంతా ఈ సభకు హాజరు కానున్నారు. పాతబస్తీ నుంచి భారీగా జనాన్ని సమీకరించి, అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెసుకు తాము ఏమాత్రం తీసిపోబోమని చాటిచెప్పనుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే నాలుగు పార్టీలు..నాలుగు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండటంతో జనసమీకరణ నేతలకు పెద్ద సమస్యగా మారింది.

Advertisement
Advertisement