రైల్వే రంగం అభివృద్ధి ఘనత బీజేపీదే.. | Sakshi
Sakshi News home page

రైల్వే రంగం అభివృద్ధి ఘనత బీజేపీదే..

Published Mon, Sep 25 2023 3:54 AM

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి  
 - Sakshi

16 గంటలు..70 శంకుస్థాపనలు

షాద్‌నగర్‌రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో రైల్వే రంగం మరింత అభివృద్ధిని సాధించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అన్నారు. వందేభారత్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్‌ుచ్యవల్‌గా ప్రారంభించిన సందర్భంగా ఆదివారం షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఆ పార్టీ నాయకులు, రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే ప్రయాణికులను అతి వేగంగా గమ్యస్థానాలకు చేరవేసే విధంగా సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ఏర్పాటు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారని అన్నారు. ప్రయాణికులు రైల్వే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ డాక్టర్‌ విజయకుమార్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్యగౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్దన్‌రెడ్డి, అందె బాబయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు చెంది మహేందర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, రైల్వే బోర్డు సభ్యులు దిడ్డిగోపాల్‌, చంద్రశేఖర్‌, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 గంటలు.. 70 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు గణపతి పూజలతో మంత్రి సబితారెడ్డి రోజంతా బిజీగా గడిపారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకున్న ఆమె.. ఒకేరోజు రూ.18 కోట్ల విలు వ చేసే 70 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్లకు రూ.100 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా లైన్లు, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నారు. పదిహేను రోజుల క్రితం ఒకేరోజు 65 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, రికార్డు నెలకొల్పిన మంత్రి.. తాజాగా తన రికార్డును తానే తిరగరాస్తూ..రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకవైపు భగ్గున మండుతున్న ఎండను, సాయంత్రం కురిసిన చిరు జల్లులను లెక్క చేయకుండా రోజంతా ప్రజల మధ్యే గడిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలను ఆలకిస్తూ అప్పటికప్పుడు వాటికి పరిష్కారమార్గం చూపించారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి

ఒక వైపు శంకుస్థాపనలు

మరోవైపు గణపతి పూజలు

రోజంతా మంత్రి సబితారెడ్డి బిజీ

స్థానికులతో ఆప్యాయంగా కరచాలనం చేస్తున్న మంత్రి సబితారెడ్డి
1/1

స్థానికులతో ఆప్యాయంగా కరచాలనం చేస్తున్న మంత్రి సబితారెడ్డి

Advertisement
Advertisement