వయసు సరిపోలే! | Sakshi
Sakshi News home page

వయసు సరిపోలే!

Published Fri, Nov 10 2023 6:48 AM

-

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆ యువకుడు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నామినేషన్‌ పత్రాలను పూర్తి చేసి ఒక సెట్‌ను వేసేందుకు కేంద్రానికి వచ్చారాయన. వయసు 25 ఏళ్లు లేకపోవడంతో అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన గౌతమ్‌ (24)కు జనతా కాంగ్రెస్‌ పార్టీ నాలుగు రోజుల క్రితం బీ–ఫాం అందజేసింది. గురువారం ఒక సెట్‌ నామినేషన్‌ వేసి 10వ తేదీన తన ర్యాలీగా మరో నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన అధికారులు పోటీ చేసేందుకు వయసు సరిపోదు అనడంతో గౌతమ్‌ నిరాశతో వెనుదిరిగారు. – రాజేంద్రనగర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement