ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన

Published Wed, Nov 22 2023 4:30 AM

కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులతో సమావేశమైన రాష్ట్ర అధికారులు   - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. రాష్ట్ర వ్యయ పరిశీలకులు ఐఆర్‌ఎస్‌ అధికారి బాలకృష్ణ , ఏపీఎస్‌ అధికారి రాష్ట్ర పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా, కలెక్టర్‌ భారతి హోళికేరి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి విచ్చేశారు. సమీకృత జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, కంట్రోల్‌రూంలను సందర్శించారు. రికార్డింగ్‌, ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేశారు. 1950 టోల్‌ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరును గమనించారు. చెక్‌పోస్టుల వద్ద ఎస్‌ఎస్‌టీ బృందాల పనితీరు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరు, కంట్రోల్‌ రూంలో జీపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ భారతి హోళికేరి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తో పాటు ఆయా నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ప్రియరంజన్‌ శ్రీవాస్తవ, వినోద్‌కుమార్‌ అహిర్వార్‌, శంకర్‌గుప్తా, జనార్దన్‌, పోలీసు పరిశీలకులు ఉత్పల్‌ కుమార్‌ నస్కర్‌ అజిత్‌సింగ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్‌ వివరించారు. ఎనిమిది నియోజకవర్గాల్లో 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఇప్పటికే అన్ని సెంటర్లకు ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బందిని కేటాయించినట్టు తెలిపారు. ర్యాండమైజేషన్‌ సైతం పూర్తయిందని చెప్పారు. జిల్లాలో 3,453 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేశామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తున్నామన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement