ఇప్పుడున్న సర్వీసులు సరిపోతాయా? | Sakshi
Sakshi News home page

ఇప్పుడున్న సర్వీసులు సరిపోతాయా?

Published Sat, Dec 9 2023 5:02 AM

-

గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ప్రస్తుతం 2,550 వరకు సిటీ బస్సులు తిరుగుతున్నాయి. నగర శివార్లలో ఔటర్‌ వెలుపల ఉన్న వందలాది కాలనీల నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు 30 వేల ట్రిప్పుల వరకు బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నట్లు అంచనా. వీరిలో 12 లక్షల మంది వరకు మహిళలు, విద్యార్థినులు ఉంటారు. ఇప్పుడున్న ఆర్డినరీ బస్సుల్లో కాలం చెల్లినవి మినహాయిస్తే మరో 1000 బస్సుల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 1000 మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలోనూ చాలా వరకు కాలం చెల్లినవే. ఈ రెండు కేటగిరీలకు చెందిన బస్సుల్లోనే ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ బస్సులు కాకుండా మెట్రో డీలక్స్‌, మెట్రో లగ్జరీ, పుష్పక్‌ తదితర కేటగిరీలకు చెందిన ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో మాత్రం చార్జీలు చెల్లించి ప్రయాణం చేయాలి. మహిళా ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఏ మాత్రం చాలవు. మరోవైపు క్రమంగా ప్రయాణికుల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది. రద్దీకనుగుణంగా ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి బస్సులు కొనాల్సి ఉంటుందని అధికారులు అంచనా.

Advertisement
Advertisement