గ్రాండ్‌ ఫినాలేకు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఆహ్వానం | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ ఫినాలేకు సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఆహ్వానం

Published Thu, Dec 14 2023 4:30 AM

నటుడు రాజేంద్రప్రసాద్‌ను ఆహ్వానిస్తున్న ఆటా ప్రతినిధులు  - Sakshi

బంజారాహిల్స్‌: ఈ నెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఆట గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ను ఆటా వేడుకల చైర్మన్‌, ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చర్ల ఆధ్వర్యంలో బుధవారం ఆయనను కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్మన్‌ వేణు సంకినేని, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, కోశాధికారి సతీష్‌రెడ్డి, కో ఆర్డినేటర్‌ సాయి సుదిని, రవీందర్‌ గూడురు, ఈశ్వర్‌ బండా, కాశీ కొత్త, అమృత్‌ ముళ్లపూడి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్‌ఎస్‌

లక్డీకాపూల్‌: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రత్యేక తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం ఆయన సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ప్రధాన అంశాలను సత్వరమే పరిష్కారం చేయాలనే అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం కొంత ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తమన్నారు. ఈ సమయంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలుత ఆర్థికపరమైన సమస్యలు తలెత్తని రిజర్వేషన్ల విషయంలో దృష్టి సారించాలని కోరారు. ఈ క్రమంలో ఆర్థిక భారం లేని హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉత్పన్నం కావన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తప మంత్రివర్గంలో కేవలం ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలకుచెందిన ఏడుగురికి అవకాశం కల్పించారన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఇద్దరికీ, 18 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కరికి ఇవ్వడాన్ని ఆక్షేపించారు. మైనార్టీలకు అసలు చోటే దక్కలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వికలాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని కోరారు.

Advertisement
Advertisement