విద్యాలయం.. బాటిళ్లమయం | Sakshi
Sakshi News home page

విద్యాలయం.. బాటిళ్లమయం

Published Sun, Dec 24 2023 4:24 AM

బడిలో పగలగొట్టిన మద్యం సీసాలు  - Sakshi

ప్రపంచ మేధా సంపత్తి పురుడు పోసుకునే క్షేత్రాలు పాఠశాలలు. అక్కడి నుంచి చిన్నారుల గమనం మొదలై సంఘ జీవితంలో భాగస్వాములు అవుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న బడుల్లో అసభ్య పనులు విస్తుగొలిపిస్తున్నాయి. మందుబాబులు అడ్డగా మార్చుకోవడంతో విద్యార్థులు భయభాంత్రులకు గురవుతున్నారు. ఈ వెకిలి చేష్టలను నిలయంగా మారింది ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పపహాడ్‌ ప్రభుత్వ పాఠశాల. సెలవు దినం వచ్చిందంటే చాలు మందుబాబులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంలాగా ఉంది. దేవాలయం లాంటి బడిలో పాడు పనులు చేస్తున్నారు. చెడు వ్యవహరాలను చూసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పటిష్ట చర్యలు తీసుకొని మందుబాబులు ఆగడాలు అడ్డుకోవాలని కోరుతున్నారు. – ఇబ్రహీంపట్నం రూరల్‌

Advertisement
Advertisement