మద్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

మద్యం పట్టివేత

Published Wed, Mar 27 2024 7:35 AM

పోలీసులుపట్టుకున్న మద్యం బాటిళ్లు  - Sakshi

ఆమనగల్లు:కిరాణాషాపు లో మద్యం విక్రయించేందుకు తీసుకువెళుతుండగా మంగళవారం ఆమనగల్లు పోలీసులు పట్టుకున్నారు. 11.5 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశారు. ఆమనగల్లు ఎస్‌ఐ బాల్‌రాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన ఎండీ హస్రఫ్‌ కిరణాషాపు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఆషాపు లో మద్యం విక్రయించే నిమిత్తం పట్టణంలోని వైన్‌షాపులో కొనుగోలు చేసి ఆటోలో తీసుకువెళుతుండగా చింతలపల్లి గ్రామ సమీపంలో చేపట్టిన సోదాలో మద్యం పట్టుకున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాం తెలిపారు. మొత్తం 11.5 లీటర్ల క్వార్టర్‌, ఫుల్‌ బాటిళ్లు పట్టుకుని సీజ్‌ చేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చేపల వేటకు వెళ్లి..

యువకుడి మృతి

షాద్‌నగర్‌ రూరల్‌: చేపల వేటకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామ స్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెగడ్డతండాకు చెందిన రమేశ్‌(30) కూలీ పనులుచేస్తూ నివసించేవాడు. సోమవారం గ్రామ శివారులోని తాళ్ల చెరువులో చేపల వేటకని వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో చెరువులోకి దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు.ఈ క్రమంలో అ తను ఆరోజు రాత్రి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తాళ్లచెరువులో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మృత దేహం కొక్క్యానికి తగలడంతో ఒ డ్డుకు లాగారు.అక్కడ వారు రమేశ్‌ మృతి చెందినట్లు గుర్తించారు. ఘట నా స్థలంలో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

రమేశ్‌ (ఫైల్‌)
1/1

రమేశ్‌ (ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement