అక్రమ మట్టిరవాణాను అడ్డుకున్న గ్రామస్థులు | Sakshi
Sakshi News home page

అక్రమ మట్టిరవాణాను అడ్డుకున్న గ్రామస్థులు

Published Wed, Jun 14 2023 5:24 AM

బాధితుడికి ఫోన్‌ అందజేస్తున్న ఎస్‌ఐ కాశీనాథ్‌ - Sakshi

మనోహరాబాద్‌(తూప్రాన్‌): అక్రమంగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. మనోహరాబాద్‌ మండలంలోని జీడిపల్లి గ్రామం మీదుగా అక్రమ మట్టి రవాణాను ఓ పరిశ్రమకు తరలిస్తున్నారనే విషయం తెలుసుకొని కొంత మంది గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో సంఘటన స్థలానికి వీఆర్‌ఏను పంపించారు. వారు వచ్చి అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవడంతో వీఆర్‌ఏకు మట్టిని తరలిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకు గొడవ జరిగింది. ఈ ఘటనలో టెంట్‌హౌస్‌ శ్రీనివాస్‌, హరీష్‌గౌడ్‌లు కోనాయపల్లి(పీటీ) వీఆర్‌ఏ నరేష్‌ను దుర్భాషలాడి అతని విధుల కు ఆంటంకం కలిగించారు. దీంతో వీఆర్‌ఏ నరేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోగొట్టుకున్న ఫోన్‌ అందజేత

జహీరాబాద్‌ టౌన్‌: పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు. మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన సిరిగిరి జర్నప్ప బైక్‌పై వెళ్తున్న క్రమంలో ఫోన్‌ పోగొట్టుకున్నాడు. దీంతో అతను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. సీఈఐఆర్‌తో మొబైల్‌ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్లు చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మీ సేవా లేదా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయా లని ఎస్‌ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో రైటర్‌ సికిందర్‌ తదితరులు పాల్గొన్నారు.

యువకుడి అదృశ్యం

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణానికి చెందిన దండు వంశీ (25) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ రంజిత్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన రంజిత్‌ తిరిగి రాలేదని అతని భార్య కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

లోన్‌ పేరిట

సైబర్‌ మోసం

వర్గల్‌(గజ్వేల్‌): లోన్‌ పేరిట ఓ వ్యక్తిని మోసం చేసిన సంఘటన వర్గల్‌ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..గౌరారం గ్రామానికి చెందిన సిరిపురం వెంకటేష్‌ ఫోన్‌పేకు రూ.5లక్షల లోన్‌ వచ్చిందని ఈ నెల 8న సైబర్‌ నేరగాళ్లు ఒక లింకు పంపించాడు. దాన్ని నమ్మిన వెంకటేష్‌ ఆ లింకును ఓపెన్‌ చేసి అందులో తన వ్యక్తిగత వివరాలు నమోదుచేశాడు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్‌ చేసి రూ.5 లక్షల లోన్‌ మంజూరైందని చెప్పాడు. అందుకు సంబంధించి రూ.9,000 ఇన్సూరెన్స్‌, ఈఎంఐ పేమెంట్‌ కలిపి మొత్తం రూ.25,000 పంపించాలని సూచించాడు. లోన్‌ వస్తుందన్న ఆశతో ఆ మొత్తం పంపించాడు. మళ్లీ టీడీఎస్‌ కోసం రూ.25,000 పంపించాల ని కోరడంతో వెంటనే వెంకటేష్‌ అనుమానపడ్డాడు. దీంతో తను మోసపోయినట్టుగా గుర్తించి వెంటనే సైబర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు.

బెజ్జంకి ఎస్‌ఐపై

సీపీకి ఫిర్యాదు

బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సిద్దిపేట సీపీకి తోటపల్లి సర్పంచ్‌ బోయినిపెల్లి నర్సింగరావు మంగళవారం ఫిర్యాదు చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ముగించాలని ఆదేశించడంతో సర్పంచ్‌తో వివాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మహిళలపై దురుసుగా ప్రవర్తించగా వాగ్వివాదం జరిగినట్లు చెప్పారు. మంత్రి స్వగ్రామం కావడంతో తెలంగాణ వేడుకల్లో వివాదం జరిగినట్లు అపవాదు వస్తుందనే కారణంతో తాను సముదాయించిట్లు సర్పంచ్‌ చెప్పారు. ఈ విషయంలో ఎస్‌ఐపై విచారణ చేపట్టాలని సీపీకి ఫిర్యాదు చేవారు. ఇటీవల కూడా మరో రెండు సంఘటనల్లో ఫిర్యాదుదారులనే ఎస్‌ఐ వేధించాడని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరారు.

Advertisement
Advertisement