గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్‌ దాడులు | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్‌ దాడులు

Published Sun, Sep 17 2023 6:34 AM

నాటుసారా, బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు   - Sakshi

అక్కన్నపేట(హుస్నాబాద్‌): ఈ నెల 5వ తేదీన ‘గుప్పుమంటున్న గుడుంబా’...గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు అనే శీర్షికన సాక్షి తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్‌ సీఐ సీహెచ్‌ పవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌ సహకారంతో అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హెన్యానాయక్‌తండా, మంజ్యానాయక్‌తండా, ఢాక్యనాయక్‌తండా, పంచరాయితండాలతో పాటు దుబ్బతండా గ్రామ పరిధిలోని రాజుతండా, వంకాయతండా, దాస్‌తండాలలో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 7లీటర్ల నాటుసారా, 60లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఎకై ్సజ్‌ సీఐ మాట్లాడుతూ.. గుడుంబా తయారీని మానుకోవాలని, లేకపోతే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా అక్కన్నపేట మండలాన్ని గుడుంబా రహిత మండలంగా తీర్చిదిద్దుతామని, ఆ దిశగా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్‌ ఎస్సై కె.శ్రీధర్‌, ఎన్‌పోర్స్‌మెంట్‌ ఎస్సై మెదక్‌ ఎ.రజిత, ఎస్‌.దామోదర్‌, అనిల్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

60లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

1/1

Advertisement
Advertisement