అవరోధాలు లేకుండా అభివృద్ధి | Sakshi
Sakshi News home page

అవరోధాలు లేకుండా అభివృద్ధి

Published Wed, Oct 4 2023 7:50 AM

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌  - Sakshi

అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

సిద్దిపేటరూరల్‌: అన్ని పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఏ అవరోధాలు లేకుండా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో ఆమె ఎంపీడీవో, ఎంపీవో, విద్యుత్‌ శాఖ ఈఆర్‌వో, ఏఈలతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పంచాయతీలలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అవరోధాలు లేకుండా అధికారులు చూడాలన్నారు. మండలాల వారిగా పెండింగ్లో ఉన్న విద్యుత్‌ బకాయిలు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ, పంచాయతీ, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనం వంటి అన్ని ప్రభుత్వ కార్యకలాపాల విద్యుత్‌ బకాయిలు త్వరగా చెల్లింపులు జరపాలన్నారు. ఆస్తి పన్ను, ఇంటి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్‌ బకాయిలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న మండలాల్లో డీపీవో, అధికారులు వేగంగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీవో దేవకిదేవి, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement