ప్రచార పర్వంలో గులాబీ జోష్‌ | Sakshi
Sakshi News home page

ప్రచార పర్వంలో గులాబీ జోష్‌

Published Tue, Oct 31 2023 6:44 AM

సభలో పార్టీ కండువాలు ఊపుతూ నినాదాలు చేస్తున్న ప్రజలు  - Sakshi

సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నారాయణఖేడ్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ విజయవంతం కావడంతో పార్టీ నాయకుల్లో జోష్‌ నెలకొంది. సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వేదిక పరిసరాలు గులాబీమయంగా మారాయి. కేసీఆర్‌ ప్రసంగం కార్యకర్తలను ఉర్రూతలూగించింది.

హైలైట్స్‌

ఖేడ్‌లోని రహమాన్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ కోసం స్టేజ్‌ ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో

తరలివచ్చారు.

6 చోట్ల పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు.

వేదికపై ఏపూరి సోమన్న ఆటపాటలతో

ఉత్సాహ పరిచారు.

ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లతో సభావేదిక పరిసరాలు గులాబీమయగా మారాయి.

నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వేదికపై నుంచి పలు సూచనలు చేశారు.

వేదికపై కల్హేర్‌ జెడ్పీటీసీ నర్సింహారెడ్డి నృత్యం చేసి అలరించారు.

సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కుటుంబీకులు సభా వేదికపైకి వచ్చారు.

4.28 గంటలకు కేసీఆర్‌ హెలీకాప్టర్‌లో సభాస్థలికి చేరుకున్నారు.

4.40 గంటలకు సీఎం స్టేజీపై వస్తుండగా ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు.

4.41 గంటలకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి 6 నిమిషాల పాటు ప్రసంగించారు.

సాయంత్రం 4.47 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం 12 నిమిషాలపాటు కొనసాగింది.

సాయంత్రం 5.15 గంటలకు సీఎం

హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

– మనూరు, కంగ్టి, కల్హేర్‌(నారాయణఖేడ్‌)

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ పైకి ఎక్కి సీఎం ప్రసంగాన్ని వింటున్న జనం
1/4

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ పైకి ఎక్కి సీఎం ప్రసంగాన్ని వింటున్న జనం

కళాకారుల ఆటాపాట
2/4

కళాకారుల ఆటాపాట

సీఎం ప్రసంగిస్తుండగా ఫోన్‌లో వీడియో తీస్తున్న నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌రెడ్డి
3/4

సీఎం ప్రసంగిస్తుండగా ఫోన్‌లో వీడియో తీస్తున్న నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌రెడ్డి

సభలో వీడియో తీస్తున్న భూపాల్‌రెడ్డి కూతురు
4/4

సభలో వీడియో తీస్తున్న భూపాల్‌రెడ్డి కూతురు

Advertisement
Advertisement