సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట చర్యలు | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట చర్యలు

Published Fri, Nov 3 2023 4:36 AM

గంజాయి మొక్కలను ధ్వంసం చేస్తున్న ఎకై ్సజ్‌ అధికారులు - Sakshi

కల్హేర్‌(నారాయణఖేడ్‌): సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కల్హేర్‌, సిర్గాపూర్‌ పోలీస్టేషన్లు తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించారు. గ్రామాల్లో శాంతి భద్రతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ హన్మంత్‌, ఎస్‌ఐలు వెంకటేశం, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల పరిశీలకులుగా

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం జిల్లాకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పరిశీలకులను నియమించింది. నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాలకు దీపక్‌ సింఘాను నియమించింది. అలాగే జహీరాబాద్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు పవన్‌కుమార్‌ను, పటాన్‌చెరుకు నజీంజైఖాన్‌ నియమితులయ్యారు. అలాగే పోలీస్‌ పరిశీలకుగా ఐపీఎస్‌ అధికారి ఎం.రాజేశ్‌కుమార్‌ను నియమించింది.

జాతీయ స్థాయి

యోగాకు షణ్ముఖ ప్రియ

కొండాపూర్‌(సంగారెడ్డి): మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాల విద్యార్థిని షణ్ముఖ ప్రియ జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయుడు పండరీ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో గురువారం అభినందన సభ ఏర్పాటుచేసి బాలికను శాలువాతో సత్కరించి, మెమెంటో ప్రదానం చేశారు. సిద్దిపేటలో జరిగిన 67వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ యోగా పోటీలలో అండర్‌ –17 విభాగంలో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచిందని, షణ్ముఖప్రియ ఈ నెలలో త్రిపురలో జరిగే పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. సర్పంచ్‌ నర్సింలు, ఎంపీటీసీ కాంతయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ లలిత, ఉప సర్పంచ్‌ మహబూబ్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

గంజాయి మొక్కల ధ్వంసం

సంగారెడ్డి: ఎకై ్సజ్‌ అధికారులు దాడిచేసి రూ.10 లక్షలు విలువచేసే గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన పెద్దాపురం చంద్రయ్య తన నాలుగు ఎకరాల భూమిలో పత్తితో పాటు గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు గురువారం వాటిని ధ్వసం చేశామని సీఐ మధుబాబు తెలిపారు. సుమారు 4 నుంచి 5 ఫీట్‌లు ఉన్న గంజాయి మొక్కలను దహనం చేశామని, వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. దాడిలో ఎస్‌ఐ స్వాతి, సిబ్బంది మాణిక్‌ గౌడ్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

ఆలయ పునర్నిర్మాణానికి

రూ.2 లక్షల విరాళం

జోగిపేట (అందోల్‌): జోగిపేట మూడో వార్డు లోని మల్లన్న స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మఠం భిక్షపతి రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గూడెం మల్లయ్యకు గురువారం నగదు అందజేశారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, గొల్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

షణ్ముఖ ప్రియను అభినందిస్తున్న 
పాఠశాల యాజమాన్యం
1/3

షణ్ముఖ ప్రియను అభినందిస్తున్న పాఠశాల యాజమాన్యం

నగదు అందజేస్తున్న మఠం భిక్షపతి
2/3

నగదు అందజేస్తున్న మఠం భిక్షపతి

పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎస్పీ రూపేష్‌
3/3

పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎస్పీ రూపేష్‌

Advertisement
Advertisement