బంగారు తెలంగాణకు కేసీఆర్‌ కృషి | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు కేసీఆర్‌ కృషి

Published Thu, Nov 16 2023 6:20 AM

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న
సోనమ్‌ టెన్నింగ్‌ భూటియా - Sakshi

కొండపాక(గజ్వేల్‌): బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు కోల సద్గుణ అన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో బుధవారం గ్రామాధ్యక్షులు మల్లం ఐలయ్యతో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరోసారి సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు పిస్క అమర్‌, భూములుగౌడ్‌, అజీమొద్దీన్‌, సంతోష్‌, కొంతం రాజు, తూం మహేందర్‌, సంపత్‌, నర్సింలుగౌడ్‌, నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయం మేరకు పని

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): ప్రజాభిప్రాయం మేరకు పని చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జాగృతి రాష్ట్ర కార్యదర్శి అనంతుల ప్రశాంత్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని బందారం గ్రామంలో బుధవారం ఎంపీపీ ర్యాగల్ల సుగుణతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామాల్లోని చెరువులకు కాల్వ ద్వారా గోదావరి నదీ జలాలు తీసుకొచ్చే బాధ్యతను సీఎం కేసీఆర్‌ తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు నూనె కుమార్‌, ర్యాగల్ల దుర్గయ్య, కొలుపుల గంగాధర్‌, అనంతుల నరేందర్‌, మంచాల శ్రీనివాస్‌, నర్ర జైపాల్‌రెడ్డి, నీల వెంకటేశం, గంగుల బాలరాజు, గొట్టె ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు

దౌల్తాబాద్‌(దుబ్బాక): ప్రశాంత వాతావరణంలో జరిగే ఎన్నికలకు ఎవరైనా భంగం కలిగిస్తే చట్ట పరమైనా చర్యలు తప్పవని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్మే అసత్య ప్రచారాలు నమ్మొద్దని జిల్లా ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ సోనమ్‌ టెన్నింగ్‌ భూటియా హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని సూరంపల్లిలో సమస్యాత్మక ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్‌ పోస్టుల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వచ్చిపోయే ప్రతీ వాహనాన్ని తప్పకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి సమయాల్లో తనిఖీలు చేసేటప్పుడు టార్చ్‌లైట్‌ను తప్పకుండా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్‌, సీఐ కమాలాకర్‌, ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement