Sakshi News home page

కర్ణాటక పరిస్థితి మనకొద్దు

Published Mon, Nov 20 2023 4:26 AM

నాయకులకు బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్న మంత్రి హరీశ్‌ రావు - Sakshi

సిద్దిపేటజోన్‌: గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లోని రాయి తీస్తాడా అన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారం ఉందని, కర్ణాటకలో మూడు గంటల కరెంట్‌ ఇస్తున్నారని, అలాంటి పరిస్థితి మనకు వద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా పలు సంఘాలు మంత్రికి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్ణాటక రైతులు కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని బాధ పడుతున్నారని అన్నారు. వ్యవసాయం కోసం 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. అద్భుతమైన మేనిఫెస్టోను బీఆర్‌ఎస్‌ ప్రకటించిందన్నారు. రైతు బీమా తరహాలో త్వరలో అందరికీ ఐదు లక్షల బీమా అందిస్తుందని, రేషన్‌ ద్వారా సన్న బియ్యం రానుందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్టాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అన్ని రంగాల్లో మార్పు వచ్చిందని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను గూర్చి వివరించాలని, మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు కావాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్‌లో డిగ్రీ స్థాయిలో గురుకుల వ్యవస్థ అమలు చేస్తామని తలిపారు. బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు.

21 సంఘాలు తీర్మానం..

మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా 21 సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మాన పత్రాలు అందించారు. అంతకుముందు ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, శివ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌ రావు కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్స్‌, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలకలను సరిదిద్దుకోవడం గొప్ప విషయం

కొండపాక(గజ్వేల్‌): రాజకీయ అలకలను సరిదిద్దుకోవడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి చెందిన కుకునూరుపల్లి మండలం తిప్పారం సర్పంచ్‌ కర్నె లక్ష్మి, ఎల్లాయిగూడెం సర్పంచ్‌ రాములు ఆదివారం మంత్రిసమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ ముంపు బాధితుల సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీర్చే బాధ్యత తనదంటూ భరోసా నిచ్చారు. రాజకీయ పరంగా అలకలు ఉన్నంత మాత్రాన ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీల్లో చేర్చుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌, వైస్‌ ఎంపీపీ సోమి భగవంతయ్య, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌చారి, మహిపాల్‌, నాయకులు గొట్టం గోపాల్‌రెడ్డి, కోల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అద్భుతమైన మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ది

రాష్ట్రం అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

మంత్రి హరీశ్‌రావు

Advertisement

తప్పక చదవండి

Advertisement