చిరుత కలకలం | Sakshi
Sakshi News home page

చిరుత కలకలం

Published Fri, Dec 8 2023 4:24 AM

ఘటనా స్థలాన్ని పరిశీలీస్తున్న ఎఫ్‌ఆర్‌ఓ వికాస్‌ - Sakshi

పెద్దశంకరంపేట(మెదక్‌): పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల శివారులో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన తోట యాదయ్య తన పొలం వద్ద పశువులను కట్టాడు. బుధవారం రాత్రి చిరుతపులి దూడపై దాడి చేసి చంపేసింది. ఘటనా స్థలాన్ని పెద్దశంకరంపేట ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వికాస్‌, అటవీశాఖ అధికారులు సందర్శించి చిరుత కదలికలు, పాదముద్రలను సేకరించారు. గ్రామస్తులు రాత్రి వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దూడ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి రైతుకు నష్టపరిహారం అందించేలా చూస్తామని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. గత సెప్టెంబర్‌ నెలలో ఇదే గ్రామంలో కనిపించడంతో పాటు టెంకటి శివారులో చిరుతపులి లేగదూడను చంపింది. అప్పటి నుంచి మండలంలో దాని సంచారం లేదు. ప్రస్తుతం మళ్లీ చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్‌ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. సెక్షన్‌ అధికారి నర్సింలు, బీట్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ గ్రామస్తులు తదితరులున్నారు.

గొట్టిముక్కులలో దూడపై దాడి

Advertisement
Advertisement