దత్తత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

దత్తత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి

Published Fri, Dec 15 2023 4:42 AM

-

సంగారెడ్డి టౌన్‌ : దత్తతకు అర్హత కలిగిన పిల్లల వివరాలు దత్తత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని డీడబ్ల్యూఓ సంధ్యారాణి అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని మహిళా ప్రాంగణంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంగారెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 12 బాలల శిశు సంరక్షణ కేంద్రాలకు దత్తత పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ కేంద్రాల సిబ్బంది వారి వద్ద ఉన్న పిల్లల వివరాలు దగ్గర పెట్టుకోవాలన్నారు. అందరూ జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ 2021 ప్రకారం శిశు సంరక్షణ కేంద్రాలు నడపాలన్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ రాజారెడ్డి మాట్లాడుతూ.. బాలల న్యాయ చట్టం ప్రకారం ప్రతీ పిల్లవాడి వివరాలు సీఏఆర్‌ఏ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో ఉండాలన్నారు. సంగారెడ్డిలోని డీపీఐఈయూ యూనిట్‌ బాగా పని చేస్తుందన్నారు. కొద్ది రోజుల కిందట తప్పిపోయిన నలుగురు బాలికలను తల్లితండ్రులకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు విష్ణుమూర్తి, మెదక్‌ సభ్యులు ఉప్పలయ్య, డీసీపీఓ రత్నం, కర్ణశీల, లింగం పాల్గొన్నారు.

Advertisement
Advertisement