మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

Published Thu, Jan 4 2024 4:24 AM

ఏవో పరమేశ్వర్‌కు అవిశ్వాసం నోటీసు 
అందజేస్తున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నాయకులు     - Sakshi

నారాయణఖేడ్‌: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనా నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ అహీర్‌ పరశురాంలపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో ఏవో పరమేశ్వర్‌కు నోటీసు అందజేశారు. కౌన్సిలర్లు ఆనంద్‌ స్వరూప్‌ షెట్కార్‌, లక్ష్మిబాయి, దారం శంకర్‌, రాజేశ్‌ చౌహాన్‌, వివేకానంద్‌, సవిత హన్మంతు, ఫరానాబేగం, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజిద్‌, సంధ్యారాణి రామకృష్ణ, నర్సింహులు నోటీసు అందించిన వారిలో ఉన్నారు. ఖేడ్‌ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను కాంగ్రెస్‌ నుంచి 8మంది కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ నుంచి 7మంది గెలుపొందారు. అప్పటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎక్స్‌ఆఫీషియో ఓట్లతో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ స్థానాన్ని కై వసం చేసుకుంది. చైర్మన్‌గా రుబీనా, వైస్‌ చైర్మన్‌గా అహీర్‌ పరశురాంలు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి 8వ వార్డు కౌన్సిలర్‌ నర్సింహులు బీఆర్‌ఎస్‌లో చేరగా.. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మాజిద్‌, సంధ్యారాణి రామకృష్ణలు మంగళవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌కు 10మంది కౌన్సిలర్ల బలం చేకూరింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన కౌన్సిలర్ల సంఖ్య పరిపడా ఉండడంతో అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది.

ఏవోకు కాంగ్రెస్‌ కౌన్సిలర్ల నోటీసు అందజేత

Advertisement
Advertisement