నేడు వట్‌పల్లికి మంత్రి | Sakshi
Sakshi News home page

నేడు వట్‌పల్లికి మంత్రి

Published Sat, Mar 9 2024 10:05 AM

- - Sakshi

వట్‌పల్లి(అందోల్‌): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం వట్‌పల్లి మండలంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌జ్యోషి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. అలాగే వెంకటఖ్వాజా దర్గా ఉత్సవాలలో పాల్గొంటారని వివరించారు.

ఆలయ అభివృద్ధికి కృషి

పెద్దశంకరంపేట(మెదక్‌): కొప్పోల్‌ ఉమా సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో ఆలయం వరకు బీటీ రోడ్డును పూర్తి చేయిస్తానన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, పోలీస్‌, రెవెన్యూ క్యాంపులను పరిశీలించారు. శనివారం నిర్వహించే ఎడ్లబండ్ల ఊరేగింపు, జాతరను సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మధు, సీనియర్‌ నాయకులు నారాగౌడ్‌, సంతోష్‌, రాజు, సంగమేశ్వర్‌, రాజశేఖర్‌రెడ్డి, రఘుపతి రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాపురాజు, సభ్యులు పాల్గొన్నారు.

బాలికలు అన్ని రంగాల్లో

రాణించాలి

మెదక్‌: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని డీవైఎస్‌ నాగరాజు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బాలికలకు జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. పోటీల్లో మెదక్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ జట్టు మొదటి బహుమతి సాధించింది. అనంతరం ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వంశీ, కోశాధికారి రూపేందర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ నరసింహారెడ్డి, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

తూప్రాన్‌: చిట్టీలు, అధిక వడ్డీల ఆశచూపి సుమారు రూ.20 నుంచి రూ.30 కోట్లతో పరారైన ఘరాన మోసగాడు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ కృష్ణ, ఎస్‌ఐ శివానందం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన బిజిలిపురం యాదగిరి కొన్నేళ్లుగా చిట్టీలు, అధిక వడ్డీలతో లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. ఆశతో కొందరు యాదగిరికి రూ.లక్షల్లో డబ్బులు ముట్టజెప్పారు. మొదట్లో ఒప్పందం ప్రకారం అధిక వడ్డీ చెల్లించాడు. విషయం ఆనోట, ఈ నోట అందరికీ తెలియ డంతో పెద్దసంఖ్యలో జనాలు డబ్బులు ఇచ్చారు. అలాగే చిట్టీలు వేసిన వారికి సైతం అధిక వడ్డీ ఆశ చూపాడు. ఇలా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం చేశాడు. చివరికి మొదట ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాల్సిన వాయిదా రావడంతో ఈనెల 4న భార్య, పిల్లలతో కలిసి పరారయ్యా డు. బాధితులు ఆందోళనకు దిగడంతో శుక్ర వారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు బాధితులతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement