మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు: హరీశ్‌రావు | Sakshi
Sakshi News home page

మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు: హరీశ్‌రావు

Published Thu, Sep 28 2023 6:24 AM

పాఠశాలను సందర్శించిన అధికారులు - Sakshi

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు ‘ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహమ్మద్‌ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని సూచించారు.

నేటి నుంచి సిటీ పోలీస్‌యాక్ట్‌

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గురువారం నుంచి సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహించరాదని సీపీ సూచించారు. సౌండ్‌ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా వచ్చే నెల 5 వరకు కొనసాగుతాయని సీపీ పేర్కొన్నారు.

భగత్‌ సింగ్‌ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

సిద్దిపేటరూరల్‌: భగత్‌సింగ్‌ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అరవింద్‌ అన్నారు. బుధవారం మండల పరిధి లోని చింతమడక హైస్కూల్లో 116వ భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ దేశ స్వతంత్య్ర పోరాటంలో భగత్‌ సింగ్‌ పాత్ర కీలకమని అన్నారు. దేశం కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన భగత్‌ సింగ్‌ జీవిత చరిత్ర ను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపూర్‌ అభివృద్ధి భేష్‌

ఎన్‌ఐఆర్‌డీ శిక్షణ బృందం కితాబు

సిద్దిపేటరూరల్‌: ఇబ్రహీంపూర్‌ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాలు భేష్‌గా ఉన్నాయని ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ బృందం సభ్యులు అన్నారు. గురువారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ పొందుతున్న పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇంకుడుగుంతలు, శ్మశానవాటిక, సామూహిక గొర్రెలషెడ్లు, డంప్‌షెడ్‌లు, రిచార్జ్‌ఫిట్‌లు, సోలార్‌విద్యుత్‌, డబుల్‌బెడ్రూం ఇళ్లు, ప్రకృతి వనాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామం అంతటా ఎంతో స్వచ్ఛంగా ఉందని, ఉపాధి హమీ ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ అనురాధ, రాజ్‌కుమార్‌, ఎంపీడీఓ మురళీధర్‌శర్మ, సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఉపాధ్యాయులు
1/2

భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఉపాధ్యాయులు

2/2

Advertisement
Advertisement