సెంటిమెంట్‌ ఆలయం ముస్తాబు | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్‌ ఆలయం ముస్తాబు

Published Sat, Nov 4 2023 4:30 AM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీసులు - Sakshi

వివరాలు IIలో u

నంగునూరు(సిద్దిపేట): సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు శనివారం మండల పరిధిలోని కోనాయిపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో వేంకటేశ్వరాలయం ముస్తాబైంది. ఇద్దరు అగ్రనేతలకు సెంటిమెంట్‌ ఆలయం ఇది. శనివారం నామినేషన్‌ పత్రాలను వేంకటేశ్వరస్వామి వారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటకు కోనాయిపల్లి చేరుకొని 11 గంటలకు నామినేషన్‌ పత్రాలపై కేసీఆర్‌ సంతకం చేయనున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం జరిగిన తరువాత మొదటి సారిగా సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లికి వస్తుండడంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్తుల తోపాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు ఎస్పీ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ ప్రసన్నకుమార్‌, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బారీకేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ముండ్రాయి మీదుగా కోనాయిపల్లి వెళ్లే దారిని చదును చేయించారు.

న్యూస్‌రీల్‌

సెంటిమెంట్‌ ఆలయం ముస్తాబు

కోనాయిపల్లికి రానున్న కేసీఆర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ

Advertisement
Advertisement