బీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన సాధ్యం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే సుపరిపాలన సాధ్యం

Published Sat, Nov 11 2023 4:24 AM

ఎంపీపీకి మద్దతు పత్రాన్ని అందిస్తున్న 
ఆర్‌ఎంపీలు   - Sakshi

జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అనంతసాగర్‌, చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరోసారి మంత్రి హరీశ్‌రావును ఆశీర్వదించాలన్నారు. సిద్దిపేట అభివృద్ధి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వనిత, సొసైటీ చైర్మన్‌లు కనకరాజు, సదానందం గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ విజయ, ఎంపీటీసీ సరిత పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావుకు

ఆర్‌ఎంపీల మద్దతు

సిద్దిపేటరూరల్‌: మంత్రి హరీశ్‌రావుకు రూరల్‌, నారాయణరావుపేట మండలాల పరిధిలోగల ఆర్‌ఎంపీలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావుకు అందించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంపీ యూనియన్‌ అధ్యక్షుడు బాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌, హరీశ్‌రావు చొరవతో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. హరీశ్‌రావు వెంటే మేము సైతం అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేశ్‌, తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతి, యూనియన్‌ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రవి, శ్రీనివాస్‌, కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు వేగిరం చేయండి

డీఆర్‌డీఓ రవీందర్‌

చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలని, తూకం వేసిన వెంటనే తరలించాలని డీఆర్‌డీఓ రవీందర్‌ నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దకోడూరు, గోనెపల్లి, రామంచ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు ఆరబెట్టిన తర్వాతే ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఏపీఎం మహిపాల్‌, సీసీలు శ్రీనివాస్‌ రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.10 లక్షలు మాయం

వెలుగులోకి మరో సైబర్‌ మోసం

విద్రోహశక్తులతో సంబంధాలున్నాయంటూ బెదిరింపు

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పటాన్‌చెరు టౌన్‌: మరో సైబర్‌ మోసం వెలుగుచూసింది. సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి ఏకంగా రూ.10లక్షలు కాజేశారు. ఈ సంఘటన అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అమీన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్‌ 6న నీకు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని, లక్నో కస్టమ్స్‌ కార్యాలయం నుంచి కాల్‌ చేస్తున్నామని, నీకోసం ఢిల్లీ పోలీసులు వస్తున్నారని బెదిరించారు. ఆ తరువాత అపరిచిత వ్యక్తి బాధితునికి మెసేజ్‌ రూపంలో ఓ లింకు పంపి దాన్ని క్లిక్‌ చేసి వచ్చిన ఓటీపీని చెప్పమన్నాడు. దీంతో బాధితుడు అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా లింకు ద్వారా వచ్చిన ఓటీపీని చెప్పగా అతని బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ.10 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు ముందుగా సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అమీన్‌పూర్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిరువ్యాపారులను ఓటు అభ్యర్థిస్తున్న
జెడ్పీ చైర్‌పర్సన్‌
1/2

చిరువ్యాపారులను ఓటు అభ్యర్థిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌

పెద్దకోడూరులో రికార్డులు
పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ
2/2

పెద్దకోడూరులో రికార్డులు పరిశీలిస్తున్న డీఆర్‌డీఓ

Advertisement
Advertisement