మంత్రి హరీశ్‌ అఫిడవిట్‌ను పరిశీలించాలి | Sakshi
Sakshi News home page

మంత్రి హరీశ్‌ అఫిడవిట్‌ను పరిశీలించాలి

Published Tue, Nov 14 2023 4:24 AM

సమావేశంలో మాట్లాడుతున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి   - Sakshi

బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మంత్రి హరీశ్‌రావు అఫిడవిట్‌లో అన్ని వివరాలను పొందుపర్చలేదని బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దూది శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి హరీశ్‌ రావు సమర్పించిన అఫిడవిట్‌లో తన కుమారుడి పేరును నమోదు చేయలేదన్నారు. అదేవిధంగా ఢిల్లీలో నమోదైనా కేసును ఈ అఫిడవిట్‌లో నమోదు చేయలేదన్నారు. అందువల్ల ఎన్నికల అధికారులకు ఈ విషయాలపై ఫిర్యాదు చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement