ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలి | Sakshi
Sakshi News home page

ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలి

Published Thu, Apr 18 2024 2:00 PM

హజ్‌ యాత్రికులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే - Sakshi

జహీరాబాద్‌ టౌన్‌: ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. పట్టణంలో గడి వీధి హరి మసీద్‌ కమిటీ సభ్యులు హజ్‌ యాత్రకు వెళ్తున్న సందర్భంగా బుధవారం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా దర్శనం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం జహీరాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనికుమార్‌ యాత్రీకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తంజీమ్‌, మచ్చేందర్‌, సంజీవ్‌రెడ్డి, అక్బర్‌, ముర్తుజా, మిథున్‌రాజ్‌, పర్వేజ్‌, అలీ, హాశం, జప్పార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement